హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు షెడ్డుకు వెళ్లడం ఖాయం, దేశద్రోహులకు, దేశభక్తులకు యుద్ధం.. బండి సంజయ్ విసుర్లు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాతో ఉంది. దుబ్బాక బై పోల్ ఇచ్చిన విజయం ఆ పార్టీకి బూస్టింగ్‌గా మారింది. మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి భాగ్యనగర ప్రజలు బుద్ది చెబుతారని అంటున్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌కు అధిపత్యం ఇవ్వడం ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. 80 శాతం హిందువులు ఉన్న హిందువుల కోసం బీజేపీ పోరాడుతుందని స్పష్టంచేశారు. హిందువుల హక్కుల కోసం బీజేపీ రాజీలేకుండా పోరాటం చేస్తుందని చెప్పారు.

దేశం దృష్టి.. గ్రేటర్ ఎన్నికలపై..

దేశం దృష్టి.. గ్రేటర్ ఎన్నికలపై..


గ్రేటర్ ఎన్నికలపై యావత్ దేశం దృష్టిసారించిందని సంజయ్ అన్నారు. కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో ప్రజలు తీర్పిచ్చారని పేర్కొన్నారు. గ్రేటర్‌లో కూడా అదే రీపిట్ అవుతోందని చెప్పారు. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. సారు, కారు, సర్కార్‌తోపాటు.. ఇకరారు అనే నినాదం వస్తోందని చెప్పారు.

దేశద్రోహులకు, దేశభక్తులకు యుద్ధం..

దేశద్రోహులకు, దేశభక్తులకు యుద్ధం..

గ్రేటర్‌లో దేశద్రోహులకు, దేశ భక్తులకు మధ్య యుద్ధం జరుగుతోందని బండి సంజయ్ తెలిపారు. దేశద్రోహులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. కానీ తానో గొప్ప హిందువునని కేసీఆర్ చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరిన బండ కార్తీకకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సంజయ్ స్పష్టంచేశారు. ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో రూప కల్పనకు సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు.

ఎవరిధీమా వారిదే..

ఎవరిధీమా వారిదే..

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.

English summary
telangana bjp chief bandi sanjay slams cm kcr on ghmc election issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X