హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతాం, త్వరలో బీజేపీలో భారీగా చేరికలు : మురళీధర్ రావు

|
Google Oneindia TeluguNews

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయనని స్పష్టంచేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. ఆ పార్టీ చరిత్ర ముగిసిన అధ్యాయమేనన్నారు. ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. సోమవారం హన్మకొండ వేదా ఫంక్షన్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు మురళీధర్ రావు.

నిధులు దుర్వినియోగం ..
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిందని .. కానీ వాటిని సద్వినియోగం చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. దీనితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే గొంతులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తలు బీజీపేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారి జాబితాను త్వరలో మీడియాకు విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

bjp fight the trs govt corruption says muralidhar rao

రాష్ట్రంలో తెలంగాణ కమిటీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని, బూతులవారీగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు వివరించారు. ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుక ఈ నెల 25, 26 తేదీల్లో అన్ని కార్పొరేషన్ల ముందు ధర్నా చేపడుతామని వెల్లడించారు. అలాగే 30వ తేదీని అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు.

English summary
BJP has made it clear that the TRS is an alternative to Telangana state. Congress party end of the state history. The TRS govt. ignored the promises given. Muralidhar Rao spoke to the media at Hanmakonda Veda Function Hall on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X