హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూసి నమామీ... కాలుష్యంపై బీజేపీ పోరాటం... నదికి పూజలు చేసిన లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని మూసి నది ప్రక్షాళనకు బీజేపీ నడుం బిగించింది. నదీ ప్రక్షాళన కోసం పోరాటాలు చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తిగా నది ప్రక్షాళనకు కృషి చేయనున్నారు. ఆ నేపథ్యంలోనే మూసినదిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్ సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్

మోడీ స్పూర్తిగా మూసీ ప్రక్షాళన

మోడీ స్పూర్తిగా మూసీ ప్రక్షాళన

ప్రధాని నరేంద్ర మోడీ నమామీ గంగా పేరుతో గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలోనే ఆయన స్పూర్తితో "నమామీ మూసీ పేరుతో హైదరాబాద్ నగరం నుండి పారుతూ... కాలుష్య కొరల్లో చిక్కుకున్న మూసీ నది ప్రక్షాళన ఉద్యమాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ప్రారంభించారు. ఈమేరకు నది ప్రారంభమయ్యో అనంతగిరి కొండల్లో మూసీనదికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూసీనదికి గొప్ప చరిత్ర ఉందని అన్నారు.

 16న మూసీ ప్రక్షాళనకు ప్రతిజ్ఝా

16న మూసీ ప్రక్షాళనకు ప్రతిజ్ఝా

హైదరాబాద్ పరిశ్రమల వ్యర్థాలతో మూసీనది కలుషితం అవుతుందని, దీంతో నది ప్రక్షాళన చేయడం అవసరమని అన్నారు. ఇందుకోసం దశలవారిగా పోరాటం చేస్తామని తెలిపారు. నది ప్రక్షాళన కోసం ఈనెల 16న హైదరాబాద్‌లోని బాపుఘాట్‌లో ప్రతిజ్ఝ చేస్తామని చెప్పారు. అనంతరం 17న సూర్యపేటలో కలుషితం అవుతున్న మూసీనదిని పరీశీలిస్తామని లక్ష్మణ్ చెప్పారు. కాగా మూసీ నంది అనంతరగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం గుండా ప్రయాణించి సూర్యపేట వద్ద క్రిష్ణానదిలో కలుస్తున్న విషయం తెలిసిందే...

కాలుష్యం అడ్డంగా మూసి, ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం

కాలుష్యం అడ్డంగా మూసి, ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం

మూసినది అంటేనే కాలుష్యానికి అడ్డగా మారింది. ముఖ్యంగా నది హైదారాబాద్ నగరం నడిబొడ్డు నుండి పారుతున్న సంధర్బంలో చుట్టు ఉన్న పరిశ్రమలు అందులో తమ వ్యర్థ పదార్థాలను వదులుతున్నారు. దీంతో అది కాలుష్యకారకంగా మారింది. అయితే ఇటివల రాష్ట్రప్రభుత్వం కూడ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సుమారు మూడు వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసింది. నదివెంట పచ్చదనాన్ని పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం నదిలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కాలువ అడ్డంగా ఇళ్లు నిర్మించుకుని ఉన్న ప్రజలు ఏమేరకు ఖాలీ చేస్తారనేది వేచి చూడాలి. మరోవైపు నదిలో మురికినీరు కలవ కుండా పలు నాళాలను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని కూడ ప్రభుత్వం చేపట్టింది.

English summary
The BJP has Decided to fight for musi River pollution from 16th december,with pm modi Inspirations state president laxman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X