హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం తెచ్చిన మోటారు చట్టాన్ని ఏం చేయాలో బీజేపీ నేతలే చెప్పాలి.. కేసీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు మద్దతు తెలుపుతున్న బీజేపీని తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఎకరవు పెట్టారు. కేంద్రంలో బీజేపీ తీసుకువచ్చిన నూతన మోటారు వెహికిల్ చట్టాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఈ చట్టం ద్వార అనేక రూట్లను ప్రైవేకటిరించే హక్కును రాష్ట్రాలకు ఇచ్చారని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో ప్రైవేటికరణను వ్యతిరేకిస్తున్న బీజేపీని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని తాము ఏం చేయాలో బీజేపీ నేతలు చెప్పాలని అడిగారు.

కాగా ప్రైవేటు ఆపరేటర్లు సంస్థలోకి రావడం ద్వార బస్సు ప్రయాణికలు మెరుగైన సౌకర్యాలు అందుతాయని కేసీఆర్ అన్నారు. మరోవైపు బీజేపీ పాలన చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

 BJP has to say what will do with the new motor vehicle act

ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో నానా యాగి చేసిన బీజేపీకి డిపాజిట్ కూడ దక్కలేదని అన్నారు. ఎన్నికల్లో పార్టీ చేసిన విమర్శలకు , ఎన్నికల్లో ఆపార్టీకి వచ్చిన ఓట్లను నవ్వాలో ఏడ్వాలో కూడ ఆర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక ప్రజలు ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని అంశాలను గమనిస్తున్నారని, ముఖ్యమంత్రి అని కూడ చూడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాజకీయాల్లో అహంభావం, అహంకారం మంచిది కాదని అన్నారు

English summary
CM KCR responded to the ongoing RTC strike in Telangana. the BJP, which supports the strike, has been criticized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X