• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

4 స్థానాల్లో గెలిస్తే పుంజుకున్నట్లా.. తెలంగాణ పోరుగడ్డలో సక్సెస్ అవుతుందా?.. బీజేపీ టార్గెట్ ఏంటి?

|

హైదరాబాద్ : బీజేపీ అగ్రనేతల చూపు తెలంగాణపై పడిందా? భవిష్యత్తులో అధికార పీఠం దక్కించుకునేలా పావులు కదపనున్నారా? నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో కమలం పవర్ పెరిగిందని భావిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్ మీదున్న ఢిల్లీ పెద్దలు తెలంగాణలో బీజేపీ పుంజుకుందని లెక్కలేస్తున్నారు. ఆ క్రమంలో భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేయనున్నారనే టాక్ జోరందుకుంది.

---------------------------

నిజాయితీ, నిబద్ధత.. మధ్య తరగతి రైతు కుటుంబం.. కేంద్రమంత్రి వరకు కిషన్ రెడ్డి ప్రస్థానం

క్యాడర్ ఉన్నా లీడర్లు లేరా?.. తెలంగాణపై ఢిల్లీ పెద్దల కన్ను

క్యాడర్ ఉన్నా లీడర్లు లేరా?.. తెలంగాణపై ఢిల్లీ పెద్దల కన్ను

తెలంగాణలో బీజేపీకి క్యాడరున్నా లీడర్లు సరిగా లేరనేది బహిరంగంగా జరిగే చర్చ. దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి చుట్టే ఆ పార్టీ రాజకీయం తిరుగుతుందనే వాదనలకు లెక్కలేదు. ఇక కొన్నాళ్లుగా దత్తాత్రేయ కూడా యాక్టివ్‌గా లేనట్లు కనిపిస్తోంది. వృద్ధాప్యానికి తోడు ఆయన కుమారుడు చనిపోవడంతో బాగా డల్ అయినట్లు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పనితీరుపై కూడా పార్టీశ్రేణుల్లో కొంతమేర అంసతృప్తి నెలకొందనే ఆరోపణలున్నాయి.

తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కన్నేసిన ఢిల్లీ పెద్దలు ఇక్కడి లోటుపాట్లను నిశితంగా గమనించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే ఊపుతో పార్టీని గాడిలో పెట్టి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా కసరత్తు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ రెండు స్థానాల్లో బోణి కొట్టిందిగా.. అదే ఊపుతో..!

ఆ రెండు స్థానాల్లో బోణి కొట్టిందిగా.. అదే ఊపుతో..!

కరీంనగర్ లో ఇదివరకు బీజేపీ బోణి కొట్టింది. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ సెగ్మెంట్లలో బోణి కొట్టడం ఇదే మొదటిసారి. 67 ఏళ్ల చరిత్రలో ఈ రెండు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం ఇదే తొలిసారి. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా యెండల లక్ష్మినారాయణ ప్రాతినిధ్యం వహించారు. అలా బీజేపీకి అక్కడ పట్టుందని చెప్పొచ్చు. ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్‌లో బీజేపీకి గెలుపు బోణి మాత్రం ఇదే తొలిసారి. అక్కడ బలమైన క్యాడర్, నేతలు ఉన్నప్పటికీ విజయం వరించడం ఇదే ఫస్ట్ టైమ్.

తెలంగాణలో మొదటినుంచి కూడా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి పట్టుంది. బండారు దత్తాత్రేయ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌లో ఇదివరకే బీజేపీ బోణి కొట్టింది. సీహెచ్ విద్యాసాగర్ రావు ఎంపీగా గెలుపొందారు. అదలావుంటే ఆదిలాబాద్, నిజామాబాద్ సెగ్మెంట్లలో బీజేపీకి బలం పెరగడం, ఆ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ఢిల్లీ పెద్దలు ఇటువైపు ఓ కన్నేసినట్లు సమాచారం.

ఉత్తర తెలంగాణలో హవా.. బీజేపీకి కలిసొస్తుందని ఆశ

ఉత్తర తెలంగాణలో హవా.. బీజేపీకి కలిసొస్తుందని ఆశ

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని నాలుగు స్థానాల్లో బీజేపీ గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. కరీంనగర్ వేదికగా జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదే టీఆర్ఎస్‌కు మైనస్ అయిందని.. బీజేపీకి కలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది.

ఏదిఏమైనా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైందని ఆ పార్టీశ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమానికైనా విజయాలు దక్కాయని.. అదే కోవలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రాభవం పెరుగుతుందని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించడం విశేషం.

------------------------

జగన్‌ సీఎం కావాలని పది సంవత్సరాలుగా.. తెలంగాణలో వీరాభిమాని ఏం చేశాడంటే..!

తెలంగాణ పోరు గడ్డపై బీజేపీ కన్ను.. రానున్న ఐదేళ్లలో..!

తెలంగాణ పోరు గడ్డపై బీజేపీ కన్ను.. రానున్న ఐదేళ్లలో..!

బీజేపీకి వరుస విజయాలు అందిస్తూ ఆ పార్టీకి వ్యూహకర్తలా వ్యవహరిస్తున్న అమిత్ షా.. తెలంగాణలో బీజేపీకి నాలుగు స్థానాలు రావడంతో ఇటువైపు కన్నేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో తెలంగాణలో రాజ్యాధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో సెంట్రల్ కేబినెట్‌లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యం కల్పించి కిషన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది.

అలాగే రానున్న ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఢిల్లీ పెద్దలు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో యువనేతలకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు పగ్గాలు అప్పగించి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడించేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ పోరు గడ్డపై బీజేపీ పెద్దలు పెట్టుకున్న ఆశలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Lok Sabha Election Results Boost Up the BJP Cadre In Telangana. BJP Candidates Won In Four Parliamentary Segments, the Highcommand full happy with that results. According to that the highcommand try to strengthen the party in Ground Level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more