హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఫిర్యాదు చేసినా.. పోలీసులు మాత్రం సరైన యాక్షన్ తీసుకోలేదనేది పిటిషనర్ వాదన. అదలావుంటే బీజేపీ జాతీయ స్థాయి నేతపై ఇలాంటి మచ్చ పడటం మరోసారి హాట్ టాపికైంది. మురళీధర్ రావుపై ఛీటింగ్ కేసు తెరపైకి రావడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

 కోట్లు స్వాహా.. ఛీటింగ్ కేసు..!

కోట్లు స్వాహా.. ఛీటింగ్ కేసు..!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఛీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2 కోట్ల 17 లక్షల రూపాయలు తీసుకుని కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని మోసం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఆ మేరకు నాలుగు నెలల కిందట 9 మందిపై అభియోగం మోపుతూ తాళ్ల ప్రవర్ణ రెడ్డి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

నామినేటెడ్ పోస్టు ఆశ చూపి తన నుంచి డబ్బులు తీసుకుని మురళీధర్ రావుతో పాటు మరికొందరు మోసగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
కేసు పెట్టి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేయలేదని తెలిపారు. ప్రవర్ణ రెడ్డి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తులో ఎందుకు జాప్యం వహించారని పోలీసులను ప్రశ్నించింది. ఆ మేరకు ప్రభుత్వం తరపున న్యాయవాది సంజాయిషీ ఇస్తూ నాలుగు వారాల్లోగా నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని విన్నవించారు. దాంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

కాకితో కాసుల బేరం: కాల్ చేస్తే వాలిపోతాడు.. ఆ తంతు ముగిస్తాడు..!కాకితో కాసుల బేరం: కాల్ చేస్తే వాలిపోతాడు.. ఆ తంతు ముగిస్తాడు..!

అసలు కథ ఏంటంటే..!

అసలు కథ ఏంటంటే..!

హైదరాబాద్ చంపాపేట ప్రాంతానికి చెందిన తాళ్ల ప్రవర్ణ రెడ్డి, తన భర్త మహిపాల్ రెడ్డికి నామినేటెడ్ పదవి కావాలంటూ సమీప బంధువైన జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డిని సంప్రదించారు. ఆ మేరకు 2015లో మురళీధర్ రావుకు సన్నిహితుడైన కృష్ణకిశోర్‌ను సంప్రదించారు. ఆ క్రమంలో పలు దఫాలుగా 2 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చానని ఆరోపిస్తున్నారు. చివరకు నామినేటెడ్ పోస్టు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ ఏడాది మార్చి నెలలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

కృష్ణకిశోర్‌, ఈశ్వర్‌రెడ్డి, గాజుల హనుమంతరావు, మంద రామచంద్రారెడ్డి, సామా చంద్రశేఖర్‌రెడ్డి, బాబా, శ్రీకాంత్‌, మురళీధర్‌రావు, జి.శ్రీనివాస్ కు ఆ మొత్తం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మురళీధర్‌రావు సహా నిందితులుగా పేర్కొన్న వారందరు తమను బెదిరించారనేది బాధితురాలి వాదన. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

 ఫోర్జరీ సంతకాలతో అపాయింట్‌మెంట్ లెటర్

ఫోర్జరీ సంతకాలతో అపాయింట్‌మెంట్ లెటర్

కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇప్పించకపోవడంతో డబ్బులు ఇవ్వాలంటూ ప్రవర్ణ రెడ్డి వత్తిడి పెంచారు. ఆ మేరకు 2016లో ఆమెకు అపాయింట్‌మెంట్‌ లెటర్ అందించారు. అయితే అది అప్పటి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి తయారుచేసిన నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ గా తేలింది. ఆ నేపథ్యంలో 2016, సెప్టెంబర్ లో సరూర్ నగర్ పోలీసులకు ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు.

దాంతో ఆమె నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తామని కృష్ణకిశోర్‌, రామచంద్రరావు హామీ ఇచ్చారట. దానికోసం కొంత గడువు తీసుకుని 2 కోట్ల 5 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చారట. అయితే వారు చెప్పిన గడువు సమయానికి చెక్కులు చెల్లక.. రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దాంతో ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 468, 478, 506, 156(3) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అయితే కేసు పెట్టి నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం చర్చానీయాంశమైంది. జాతీయ స్థాయి నేతగా రాణిస్తున్న మురళీధర్ రావు ఈ ఛీటింగ్ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపికైంది.

English summary
BJP National General Secretary Muralidhar Rao facing 2 crores of cheating case. Hyderabad resident thalla pravarna reddy made allegations on him and approached the high court. Earlier she lodged a complaint on nine persons along with muralidhar rao in saroor nagar police station, but the police were not taken any action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X