హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ నేత బలవన్మరణం.. ఎక్కడ.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

భూ వివాదం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బీజేపీ నేత సంరెడ్డి వెంకట్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలోని తొర్రూర్‌ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి.. తన వ్యవసాయ భూమి పక్కనే గల ఎకరం నర భూమికి సంబంధించి పక్క రైతు వద్ద అగ్రిమెంటు చేసుకున్నారు. అందుకోసం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వద్ద సుమారు రూ. కోటి తీసుకువచ్చారు. వాటికి మరో రూ. 30 లక్షలు కలిపి రైతుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సదరు రైతు భూమిని రిజిష్ట్రేషన్ చేయడం లేదు.

తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. మంగళవారం తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో తీవ్ర గాయలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రితో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. సంరెడ్డి వెంకట్‌రెడ్డి నగరంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూములు ఇప్పించేవారు.

bjp leader suicide in hyderabad

శ్రీ మిత్ర, జన చైతన్య, స్పెక్ట్రా, జీపీఆర్‌ వంది సంస్థలకు వేల ఎకరాల భూములు ఇప్పించినట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తొర్రూర్‌ గ్రామం నుంచి ఎన్నికల బరిలో దిగేవారు, గత సంవత్సరం జరిగిన తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. టీడీపీలో క్రియాశీలంగా పని చేసి.. అంటు నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడి పోయారు. వెంకట్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

English summary
bjp leader venkat reddy suicide at hyderabad hayath nagar for registration issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X