హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వకుంట్ల కమీషన్ రావుగా కేసీఆర్.. వరదసాయం పేరుతో నగదు నొక్కేశారు: వివేక్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత వివేక్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని దోస్తున్నారని విరుచుకుపడ్డారు. వరద సాయం పేరుతో కోట్లు నొక్కేసారని ఆరోపించారు. బల్దియాలో బీజేపీ విజయం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభ తగ్గుతోందని అన్నారు. వరసగా ఆ పార్టీ ఓడిపోతుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కమీషన్ రావుగా మారిపోయారని వివేక్ మండిపడ్డారు. సిటీలో వరదలు వస్తే సీఎం కేసీఆర్ మాత్రం కమీషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. వరద సాయంలో బాధితులకు రూ. 5 వేలు ఇచ్చి టీఆర్‌‌ఎస్ నేతలు రూ.ఐదు వేలు నొక్కేశారని తెలిపారు. ఇప్పుడు అదే డబ్బును గ్రేటర్ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు వెల్లడించారు.

bjp leader vivek slams cm kcr

కేటీఆర్ టీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్లమెంట్‌‌లో 7 స్థానాలు కోల్పోయిందని వివేక్ తెలిపార. ఇటీవల దుబ్బాకలో ఓడిపోయిందని చెప్పారు.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను బట్టి కేటీఆర్ నాయకత్వ సమర్థత ఏంటో తెలుస్తుందన్నారు. గతంలో వచ్చినన్నీ సీట్లు రావు అని.. మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కానీ గ్రేటర్ ప్రజలు టీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని.. అందుకే సర్కార్ ముందుకొచ్చిందని తెలిపారు. ఎల్ఆర్‌‌ఎస్ కూడా రద్దు చేయిస్తాం అని వివేక్ పేర్కొన్నారు.

Recommended Video

GHMC Elections 2020 : Janasena Out to Support BJP తప్పుకొనేలా పవన్ కల్యాణ్‌ను ఒప్పించారు...!!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.

English summary
bjp leader g vivek slams cm kcr on ghmc elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X