హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగల్లా ఇంటిచుట్టూ తిరుగుతున్నారు.. బీజేపీ నేతలపై ఉత్తమ్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు పీక్ స్టేజీకి చేరాయి. కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్- బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ నేతల లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

 bjp leaders roaming congress leaders houses: uttam kumar

బీజేపీ నేతలు అర్ధరాత్రి దొంగల్లా కాంగ్రెస్‌ నేతల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని గుర్తుచేశారు. ఇప్పెడేమో పైకి ఇలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటు దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పలికేందుకే ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని చెప్పారు. ఇటీవల జరిగిన బీహర్ ఫలితాలే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. పైకి మాత్రం ఒకలా.. లోన మరోలా ఉంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు.

Recommended Video

Ravi Shastri Gives Ultimatum To Rohit Sharma, Ishant Sharma | India Vs Australia | Oneindia telugu

ఇటు రాష్ట్రంలో నిలిచిపోయిన పనులకు ఎవరూ బాధ్యులు అని ఉత్తమ్ అడిగారు. ఐటీ రీజియన్‌ రద్దయితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఎందుకు పునరుద్ధరించలేదు అని అడిగారు. వరద బాధితులను సీఎం కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదని ఉత్తమ్ విమర్శించారు. కానీ పైకి మాత్రం తాము అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

English summary
bjp leaders roaming congress leaders houses pcc chief uttam kumar reddy alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X