• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ ఫోకస్ .. గెలుపు గుర్రాలకే టికెట్లు , ఆ హామీలే ప్రచారాస్త్రాలు

|

దుబ్బాక ఉప ఎన్నికల హడావిడి ముగిసింది. గెలుస్తారా ? ఓటమి పాలు అవుతారా ? అనే విషయం పక్కన పెడితే దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించింది. దుబ్బాక ఉప ఎన్నిక పోరులో పెద్ద యుద్ధమే చేసింది. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నవంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టింది బిజెపి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అవుతున్న యంత్రాంగం .. నోటిఫికేషన్ నవంబర్ లోనే ?జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అవుతున్న యంత్రాంగం .. నోటిఫికేషన్ నవంబర్ లోనే ?

 గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ

గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ

గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అప్పుడు బిజెపి నుండి గ్రేటర్లో ముఖ్య నేతలు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఫలితాలను రాబట్టలేకపోయింది. గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్ల ను గెలిపించుకోలేక పోయారు. ఇక ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఒక ఎమ్మెల్యే సీటు పరిమితమైంది. కానీ ఎమ్మెల్యేగా ఓటమిపాలైనా, ఎంపీగా కిషన్ రెడ్డి విజయం సాధించి, ఏకంగా కేంద్రమంత్రిగా పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా బిజెపి అగ్రనాయకత్వం దూకుడు చూపించగలిగిన నేత అయిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించి దూసుకుపోవాలని సూచించింది. దీంతో గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

దుబ్బాకలోనూ దడ పుట్టించిన బీజేపీ .. ఇక గ్రేటర్ పై పక్కా ప్లాన్ తో ఫోకస్ ..

దుబ్బాకలోనూ దడ పుట్టించిన బీజేపీ .. ఇక గ్రేటర్ పై పక్కా ప్లాన్ తో ఫోకస్ ..

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార టీఆర్ఎస్ పై దూకుడుగానే వెళుతున్నారు. మొన్న దుబ్బాక ఎన్నికల్లోనూ దీటుగా ప్రచారం చేసిన సంజయ్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్షేత్రస్థాయిలో కేడర్ ను యాక్టివ్ చేస్తున్నారు సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించడం కోసం ఇప్పటికే నలుగురు అధ్యక్షుల ప్లాన్ ను అప్లై చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ ప్లాన్ వర్కవుట్ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ప్రచారాస్త్రాలు ఇవే ... ప్రజల్లోకి వెళ్ళేలా ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు

ప్రచారాస్త్రాలు ఇవే ... ప్రజల్లోకి వెళ్ళేలా ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు

టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేర్చని హామీలను, ఇటీవల వర్షాలు వరదల కారణంగా హైదరాబాద్ పరిస్థితిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలచుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వెళ్లాలని బిజెపి భావిస్తోంది.
ఈ నేపధ్యంలో గట్టిగా ప్రచారం చెయ్యటంలో సక్సెస్ అయితే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించే అవకాశం ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ వరద సహాయాన్ని అందిస్తున్నామని రూ.10000 పంచుతూ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, సానుకూలత గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు .. గులుపు గుర్రాలకే టికెట్లు

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు .. గులుపు గుర్రాలకే టికెట్లు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారిని చివరి నిమిషంలో హడావుడిగా ఎంపిక చేయడం కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు బిజెపి అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారి దరఖాస్తులను పరిశీలించి, అందులో ఎవరైతే విజయం సాధిస్తారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారికే టిక్కెట్లు ఇవ్వాలని, ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.ఈ బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. గ్రేటర్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాషాయ జెండా ఎగరవేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటటానికి కావలసిన సన్నాహాలను చేపట్టి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ.

English summary
The BJP is focusing on the Greater Hyderabad elections in the wake of signs that a notification will be issued in November for the Greater Hyderabad elections. The BJP has decided to give tickets to the winning persons. The BJP leaders want to look at the applications of those who are interested and find out who will win in the field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X