హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లింగ్ నిలువరించడం లేదు అని బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాతబస్తీలో గో వధ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

గో వుల తరలింపును బీజేపీ/ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ శ్రేణులు ఎప్పటికప్పుడు నిలువరిస్తున్నాయి. ఉత్తర భారతంలో ఎక్కువగా రవాణా జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనూ స్మగ్లింగ్ జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో కూడా పట్టుకున్నారు. గో హత్యలు జరుగుతున్నాయని.. నిలువరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం క్షేత్రస్థాయిలో పట్టించుకున్నట్టు అనిపించడం లేదు. దీనిపై బీజేపీ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

bjp mla Rajasingh was caught smuggling 33 cows

ఎంఐఎంను సపోర్ట్ చేసే కేసీఆర్ గో హత్యలు జరుగుతున్న పట్టించుకోవడం లేదని రాజాసింగ్ అన్నారు. ఇవాళ చౌటుప్పల్ నుంచి 33 ఆవులును బహదూర్ పురా కబేలాకు తరలిస్తుండగా పట్టుకున్ానమని తెలిపారు. గోవులను తరలిస్తున్న వారిని పోలీసులకు అప్పగించామని చెప్పారు. గోవుల తరలింపుప తాము ఫిర్యాదు చేసిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

గో హత్యలను నిలువరించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే పోలీస్ కమిషనర్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. అయినా తనకు న్యాయం జరగకుంటే సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ వద్ద నిరసన చేపడుతానని తెలిపారు. ఫాం హౌజ్ ఎదుట ఆందోళన చేపడుతామని రాజా సింగ్ చేసిన కామెంట్ రాజకీయంగా దుమారం చెలరేగింది.

English summary
bjp mla Rajasingh was caught smuggling 33 cows from chaut uppal to a slaughterhouse in bahadurpura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X