హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC elections 2020: బీజేపీ యువ ఎంపీకి బూతు పదంతో గ్రాండ్ వెల్‌కమ్: ఇదెక్కడి సంప్రదాయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార వ్యవహార శైలి విమర్శలకు దారి తీస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలకు చేదు అనుభవాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యకు ఓ బూతు పదంతో స్వాగతం పలుకుతున్నారు హైదరాబాద్‌కు చెందిన బీజేపీయేతర పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు. ఈ బూతు పదాన్ని ట్రెండింగ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటువైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటు

చౌకబారు విమర్శలకు..

చౌకబారు విమర్శలకు..

పలకడానికి, రాయడానికీ వీల్లేని పదం అది. బీజేపీ మీద ఆగ్రహంతో వారు ఈ పదాన్ని వినియోగించడం, దాన్ని ట్రెండింగ్ చేయడం హైదరాబాద్ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రచారానికి వచ్చే ప్రత్యర్థి పార్టీల నేతలపై వ్యక్తిగతంగా దాడులకు పాల్పడేలా, వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా..బూతు పదాలను ప్రయోగించడాన్ని ఎవరూ స్వాగతించబోరని అంటున్నారు. చౌకబారు విమర్శలు, దిగజారుడు ఆరోపణలకు ప్రత్యర్థులు పూనుకుంటున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి తేజస్వి సూర్య కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌కు చేరుకున్నారు. బెంగళూరు దక్షిణం లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన బీజేపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ నేతలు, యువమోర్చా కార్యకర్తలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన `ఛేంజ్ హైదరాబాద్` అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు..

మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు..

అనంతరం కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తేజస్వి సూర్య రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న డివిజన్లలో బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న అభ్యర్థులతో కలిసి ఆయన రోడ్‌ షోలల్లో పాల్గొంటారు. ఆయన హైదరాబాద్‌కు చేరిన కొద్ది సేపటికే బీజేపీయేతర పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు.. ఓ బూతు పదంతో తేజస్వి సూర్యకు స్వాగతం పలకడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే-వివాదాలకు కేంద్రబిందువైంది.

Recommended Video

GHMC Elections 2020 : అన్ని పార్టీల నజర్.. పాతబస్తీ, మజ్లిస్‌ను మట్టికరిపించడానికి బీజేపీ
ఇదెక్కడి దుస్సంప్రదాయం..

ఇదెక్కడి దుస్సంప్రదాయం..

ఓ జాతీయ పార్టీకి చెందిన యువనేతను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, దాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకుని రావడం పట్ల రాజకీయాల్లో ఓ దుస్సంప్రదాయానికి తెర తీసినట్టవుతుందని విమర్శిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని ఎవరూ స్వాగతించబోరని, ఎన్నికల్లో తాము విజయం సాధించి.. వారికి బుద్ధి చెబుతామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని, ఆ అక్కసుతోనే ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారుతుందని అంటున్నారు.

English summary
BJPYM National and Bengaluru South MP Tejasvi Surya trolled by netizens for entering Hyderabad. Tejasvi Surya landed in Hyderabad for participating in GHMC elections for BJP candidates campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X