హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ,ప్రభుత్వం స్పందించింది. లక్ష్మణ్ ఆరోపణలపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. దీంతో సీబీఐ విచారణకైనా సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ సైతం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు సిద్దంగా ఉండాలని తేరాసకు ఎదురు సవాల్ విసిరాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి విద్యుత్ ఒప్పందాలపై మట్లాడారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో అధికారులతో వివరణ ఇప్పించడం వెనుక అంతార్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలోని నాయకులు ముందుకు రాకుండా అధికారులను బలి చేసేందుకే వారితో సమాధానాలు ఇప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈనేపథ్యంలోనే అవినితీలో కూరుకుపోయిన టీఆర్ఎస్ పార్టీకి డాక్టరేట్ కూడ ఇవ్వచ్చని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయితీ విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే సర్పంచ్‌లను తొలగిస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించనందుకు ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించారు.

 BJP president Laxman has questioned once again the on power agreements,

ఈనేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ సంస్థలు రూ.20వేల కోట్లు నష్టాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక సోలార్ ఒప్పందాల్లో వేల కోట్ల రుపాయాల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రజల సోమ్ము దుర్వినియోగం పై న్యాయపోరాటం తోపాటు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన ఫైర్ అయ్యారు.అయితే లక్ష్మన్ చేసిన ఆరోపణను జెన్‌కో మరియు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జికాడు సీబీఐ విచారణకైనా తాము సిద్దమే అని సవాల్ విసిరారు..తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని, విద్యుత్ ఒప్పందాల విషయంలో స్వచ్ఛంధంగానే వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. లక్ష్మన్ తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేశారని అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై ఎవ్వరికి అపోహలు ఉన్నా తీర్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

English summary
BJP president Laxman has questioned the impediment behind clarifying with the authorities on power contracts.what is meaning of clarifying with the authorities on power contracts he asked,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X