హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మే 2న స్టేట్ బంద్.. రేపు కలెక్టరేట్ల ముట్టడి.. ఇంటర్ పోరులో బీజేపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల తప్పిదాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కమలనాథులు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండుతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అయితే పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో ఆ పార్టీ లీడర్లు భగ్గుమంటున్నారు. శాంతియుతంగా తమ పార్టీ కార్యాలయంలో నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం దౌర్జన్యానికి దిగుతోందంటూ ధ్వజమెత్తారు.

బీజేపీ నేతల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని.. అలా అడ్డుకోవాలని చూడడం అవివేకమని ఎద్దేవా చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న లక్ష్మణ్ ను ఎక్కడికి తరలించినా సరే అక్కడే దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.

bjp protest on inter results and given bandh call on may 2nd

<strong> పంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు</strong> పంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మంగళవారం (30.04.20919) నాడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల దగ్గర నిరసన చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలకు నిరసనగా.. మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు.

English summary
Telangana BJP Leaders Protest on inter results failure. They demanding the government for justice. The BJP state president laxman went to hunger strike, the police were broken. Due to this, the bjp leaders given bandh call on may second.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X