హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గులాబీ నేతల వ్యవహారంపై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల నిర్మాణాల శంకుస్థాపన ఇంత ఆఘమేఘాల మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న బండి సంజయ్..!వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న బండి సంజయ్..!

రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్మాసిటీని లింక్ చేయడం కోసం నిర్మించాల్సిన రోడ్డుకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో శంకుస్థాపన చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటని సంజయ్ కుమార్ నిలదీసారు. ఫార్మా సిటీ నిర్మాణం వెనక కేటీఆర్ గారి
రాష్ట్రాలేమైనా బిచ్చగాళ్లా అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రశేఖర్ రావుకు ప్రజాప్రతినిధులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసుకోవాలని కూడా బిచ్చగాళ్లలాగా అడుక్కోవాలా అంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్ కుమార్.

BJP state President Bandi Sanjay fired on TRS leaders..!

బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావుపై టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే పోలీసులు దాడి చేశారని, ఇక చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దళిత బాలికపై టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ కార్యకర్త అత్యాచారం కేసులో ఎమ్మెల్యే బలాల ప్రవర్తించిన తీరు, బిజెపి దళిత నాయకురాలును ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం వెనక కూడా టీఆర్ఎస్ ఉదాసీన వైఖరే కారణమని సంజయ్ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో దళితులపైన, మహిళలపైన దాడులు జరిగినా, హత్యాచారాలు జరిగినా కేసులు పెట్టకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికమని బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary
BJP state President Bandi Sanjay fired on TRS leaders..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X