హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఏ పాల్ లెక్క ఇదీ: మునుగోడులో కమల వికాసమే..? టీఆర్ఎస్ లక్ష కోట్లు ఖర్చు చేసినా నో యూజ్

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్.. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ఆయన ఏ రోజు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అప్పుడే తమ పార్టీ అంటారు.. తర్వాత అదేం లేదని చెబుతారు. ఇవాళ ఏమో మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తోందో చెప్పేశారు. టీఆర్ఎస్‌ పార్టీకి విజయవకాశాలు లేవని కుండబద్దలు కొట్టారు.

 పాల్ జోస్యం

పాల్ జోస్యం

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏంటో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవదని తేల్చిచెప్పారు. ఆ పార్టీ లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా గెలిచేది లేదన్నారు. విజయం మాత్రం బీజేపీదేనని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితంలో గెలుపు సాధించేది బీజేపీ పార్టీయేనని..ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ నుంచి సగం మంది బీజేపీలో జాయిన్ అవుతారని కేఏ పాల్ అంచనా వేశారు..

బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తే బెటర్

బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తే బెటర్


ఈ నెల 19,20 తేదీల్లో మునుగోడులో పర్యటిస్తానని తెలిపారు. ఉప ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను కలవాలని యత్నించినా కొంతమంది టీఆర్ఎస్ నేతలు కలవనివ్వలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజకీయంగా ఇంకా అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజకీయంగా కేటీఆర్ ఇంకా పరిపక్వత చెందలేదన్నారు.

దిలీప్ కుమారే..

దిలీప్ కుమారే..


కేసీఆర్‌కు తనకు గొడవ పెట్టింది దిలీప్ కుమార్ అంటూ ఆరోపించారు. కేసీఆర్‌ను కలవటానికి అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని ఆరోపించారు. మునుగోడులో మాత్రం కమల వికాసమే అని తేల్చిచెప్పారు. బీజేపీకి జనం అవకాశం కల్పిస్తారని వివరించారు. అక్కడ బీజేపీ గెలవడం ఖాయం అని కేఏ పాల్ కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.

విజయమో

విజయమో


పాల్ విశ్లేషణ అటు ఉంచితే.. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ గెలిస్తే.. బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయి. 21వ తేదీన భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితం ఉండనుంది. బీజేపీ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. లోక్ సభ ఎన్నికల సమయం నాటికి బీజేపీ బలీయశక్తిగా అవతరించనుంది.

English summary
bjp will win the munugodu assembly seat prajashanti party chief ka paul said.కే
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X