హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘటుగా స్పందించారు.. హైదరాబాద్ అంటే కిషన్ రెడ్డికి ఇష్టం లేనట్లుందని ఓవైసీ మండిపడ్డారు.

 కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దిన్ ఫైర్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దిన్ ఫైర్

హైదారాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా మారిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దిన్ ఘుటుగా స్పందించారు. కిషన్ రెడ్డి మంత్రి భాద్యతలు చేపట్టకుండానే కిషన్ రెడ్డి ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారహితంమని అన్నారు. గత అయిదు సంవత్సరాలుగా ఎంతమంది ఉగ్రవాదులు హైదరాబాద్‌ను అడ్డగా చేసుకున్నారని ఉన్నారని, ఒకవేళ ఉగ్రవాదులు ఉంటే ఏన్ఐఏ ఏంతమందిని అరెస్ట్ చేసిందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే ఐసిస్ సభ్యులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో పట్టుపడ్డారని మరి యూపి ఉగ్రవాదులకు అడ్డగా మారిందా అని ప్రశ్నించారు.

బీజేపీకి మెజారీటీ వస్తే ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా..

బీజేపీకి మెజారీటీ వస్తే ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా..

ఇక బీజేపీ మూడు వందల సీట్లను గెలిస్తే ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు అవుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. మరోవైపు భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేయలని అన్నారు.ఈనేపథ్యంలోనే రాజ్యంగానికి ఎవరు అతీతులు కాదని అన్నారు.దీంతో మోడీ లవ్ జీహాద్ అంటూ మోడీ దళితులపై దాడులు చేశారని బీజేపీ రాజ్యంగం ప్రకారం ప్రభుత్వాన్ని అమలు చేయకపోతే తాము చట్టప్రకారం పోరాడతామని అన్నారు.

బీజేపీ నేతలు గందరగోళం స‌ృష్టిస్తున్నారు

బీజేపీ నేతలు గందరగోళం స‌ృష్టిస్తున్నారు

ఇక ప్రధాన మంత్రి మోడీ ఒకటి మాట్లాడితే కిషన్ రెడ్డి మరోకటి మాట్లాడుతున్నారని అన్నారు. మరోవైపు వీహెచ్‌పీ కూడ ఇంకోటీ మాట్లాడుతుందని అన్నారు.ఇలా బీజేపీకి చెందిన వారు పలు రకాలుగా మాట్లాడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

గత అయిదు సంవత్సరాలుగా హైదారాబాద్‌కు అనేక మల్టీనేషనల్ కంపనీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని ,ఇందులో భాగంగానే బెంగళూర్ తర్వాత హైదారబాద్ నుండే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయని అన్నారు.

తెలంగాణలో బీజేపీ ,ఆర్ఎస్ఎస్ ఆటలు సాగవు...

తెలంగాణలో బీజేపీ ,ఆర్ఎస్ఎస్ ఆటలు సాగవు...

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యర్యంలో తెలంగాణ అభివ‌ృద్ది వైపు దూసుకుపోతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు.కాగా హైదరాబాద్‌లో భిన్నత్వంలో ఏకత్వం అనే సంసృతి ఉందని ..ఇలాంటీ పరిస్థితుల్లో బీజేపీ, అర్ఎస్ఎస్ కుట్రలు కొనసాగించలేవని అనంతరం విజయం కూడ సాధించలేవని అసదుద్దిన్ అన్నారు.ఇక కిషన్ రెడ్డి బాధ్యతరహితమైన వాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.

English summary
Minister of State for Home Kisan Reddy did not like Hyderabad, said MIM chief Asadudin Owaisi slams the kishan reddy comments on hyderabad terrorism .and he also said that bjp would muslims as secondary citizens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X