హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు అరుదైన గుర్తింపు: టాప్ బెస్ట్ 50లో చోటు: ఫేమ్ ఇండియా

|
Google Oneindia TeluguNews

అనంతపురం/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు శాసన సభ్యులకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో అత్యుత్తమ తొలి 50 మంది ఎమ్మెల్యేల జాబితాలో వారికి చోటు దక్కింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు కేవీ ఉషశ్రీ చరణ్‌, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ మాత్రమే ఈ ఘనతను సాధించగలిగారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఫేమ్ ఇండియా-ఆసియా నిర్వహించిన ఓ సర్వేలో వారు టాప్-50లో స్థానాన్ని సంపాదించగలిగారు.

ఉషశ్రీ చరణ్.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాదినేని ఉమామహేశ్వర నాయుడును 19 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్న ఆమె.. నియోజకవర్గం ప్రజలను తరచూ కలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించడం, లాక్‌డౌన్ సమయంలో తన నియోజకవర్గం పరిధిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి ముందుండటం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా టాప్-50 ఎమ్మెల్యేల్లో చోటు దక్కిందని అంటున్నారు.

BJP, YSRCP MLAs T Raja Singh and Ushasri Charan selected for Fame Indias survey top 50 MLAs

హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న టీ రాజాసింగ్ ఇతరుల్లో స్ఫూర్తి రగిలిస్తున్నారని ఫేమ్ ఇండియా-ఆసియా సర్వే పేర్కొంది. అత్యంత స్ఫూర్తిదాయక నాయకుడిగా ఆయనను పేర్కొంది. అత్యుత్తమ ఎమ్మెల్యేల జాబితాలో రాజాసింగ్ రెండో స్థానంలో నిలిచారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని ప్రదర్శించే నాయకుడిగా, తోటి వారిలో స్ఫూర్తినింపే నేతగా పేర్కొంది. మోస్ట్ ఇన్‌ఫ్లూయెంట్ లీడర్‌గా రాజాసింగ్‌ను గుర్తించింది ఫేమ్ ఇండియా-ఆసియా సర్వే.

BJP, YSRCP MLAs T Raja Singh and Ushasri Charan selected for Fame Indias survey top 50 MLAs

Recommended Video

AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులకు చోటు దక్కింది. వారి వారి స్థాయిలో, వారి నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో మమేకం కావడం, లాక్‌డౌన్ వంటి పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రాతిపదికగా తీసుకుని, ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఈ జాబితాను రూపొందించింది. సుధీర్ ముంగటివర్, ఆశీష్ షెలర్, హర్రషా సంఘ్వీ, సతీష్ పునియా, చిరంజీవి రావు, ప్రకాశ్ రాణా, ఆదిత్య గోలె, సోమ్‌వీర్ సంగ్వాన్, డాక్టర్ జితేంద్ర కుమార్, అర్వింద్ బెల్లద్, డాక్టర్ భారతి లోవేకర్ వంటి ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు.

English summary
Fame India-Asia Post has conducted a survey about MLAs across the country and has decided to publish top 50 MLAs. BJP MLA T Rajasingh from Goshamahal in Telangana and YSRCP MLA Ushasri Charan from Kalyanadurgam in Ananthapur district of AP got place in top 50 MLAs list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X