హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్..జగన్..ఓ ఎంపీ..!పోతిరెడ్డిపాడు పేరుతో డ్రామా రక్తి కట్టిస్తున్నారన్న రేవంత్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేక రాజకీయ ములుపులు తిరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల కీలక నేతలు ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. చివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే అంశంపై అత్యవసన సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించుకునే వరకూ వెళ్లారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా ప్రాజెక్టు విషయంలో ఏపి ప్రభుత్వం తప్పు చేయడంలేదని వాదిస్తోంది. సరిగ్గా ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. మల్కిజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇదే అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

పోతిరెడ్డి పాడు ఓ కాలక్షేప కార్యక్రమం.. ఇరు సీఎంలు కావాలనే నాటకమాడుతున్నారన్న రేవంత్..

పోతిరెడ్డి పాడు ఓ కాలక్షేప కార్యక్రమం.. ఇరు సీఎంలు కావాలనే నాటకమాడుతున్నారన్న రేవంత్..

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అంశంలో ఏపి, తెలంగాణ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కొంతమంది నేతలు ప్రాజెక్టు కోసం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ఏపి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తుండాగా, కొంత మంది నేతలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్షలు నిర్వహించారు. ఏపిలో కూడా ప్రాజెక్టుకు అనుకూలంగా కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్న సందర్బాలు కూడా చూస్తున్నాం. ఇక తెలంగాణలోని మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఇదే అంశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం ముందుగా నిర్ణియించుకున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే పోతిరెడ్డి పాడు సన్నివేశాన్ని రక్తికట్టించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు.

పోతిరెడ్డి పాటు జగడం స్వీయ ప్రయోజనాలకే.. ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న మల్కాజిగిరి ఎంపీ..

పోతిరెడ్డి పాటు జగడం స్వీయ ప్రయోజనాలకే.. ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న మల్కాజిగిరి ఎంపీ..

అంతే కాకుండా ఆంధ్ర, తెలంగాణ జలవివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుగా బదులుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అంతర్గతంగా స్నేహపూర్వకంగా ఉంటూనే బయటకు మాత్రం ఘర్షణపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని కొట్టిపారేసారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహానికి, వారి వారి పత్రికల్లో వస్తున్న వార్తలే నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు అంశంలో ఉన్న సీరియస్ నెస్ అన్ని పత్రికలు ప్రచురిస్తున్నా రెంగు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రుల సంబంధించని పత్రికల్లో మాత్రం నామమాత్రంగా ప్రచురించడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

అంశం సీరియస్ ఐతే ఇరు సీఎంల పత్రికల్లో ఎందుకు ప్రచురించరు.. సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..

అంశం సీరియస్ ఐతే ఇరు సీఎంల పత్రికల్లో ఎందుకు ప్రచురించరు.. సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జలవివాదాలు వారివారి స్వప్రయోజనాలకోసమే తెరమీదకు తెచ్చారని, అందులో ప్రజాప్రయోజనాలు ఏమాత్రం లేవని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫిర్యాదు చేసినట్టు నటిస్తాడని, వెంటనే తెలంగాణ నాయుకులు, ప్రజలు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారని, అదే విషయాన్ని ప్రభుత్వ పక్షాన నడిచే ప్రముఖ పత్రికలో మాత్రం ఎక్కడో లోపల పేజీల్లో ప్రచురిస్తారని, ఇక అదే వార్తను హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న జగన్ పత్రికలో మొదటి పేజీలో వస్తుందని తెలిపారు. ఆంధ్రాలో తమ నీళ్లను తామే వాడుకుంటున్నట్టు జగన్ ప్రజలను తన పత్రిక ద్వారా మభ్యపెడతారని చెప్పారు. తెలంగాణ వార్తలను మాత్రం తెలంగాణ ఎడిషన్ మొదటి పేజీలో జగన్ పత్రిక ఏరోజూ ప్రచురించదని ఇది వారి అవగాహనలో భాగమని వివరించారు రేవంత్ రెడ్డి.

Recommended Video

YS Jagan Govt Shocking Guidelines To Corporate Colleges
ప్రధాన మీడియా వాస్తవాలు చెప్పడం లేదు.. సోషల్ మీడియా బహిర్గతం చేస్తోందన్న రేవంత్..

ప్రధాన మీడియా వాస్తవాలు చెప్పడం లేదు.. సోషల్ మీడియా బహిర్గతం చేస్తోందన్న రేవంత్..

పోతిరెడ్డి పాడుకు సంబంధించిన జీవో, తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, మంత్రుల వ్యతిరేకత, ఏపి మంత్రుల వివరణ అన్నీకూడా గూడుపుఠానిలో భాగమని రేవంత్ రెడ్డి అభింర్ణించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసమర్థతను దాచిపెట్టుకోవడానికి ఉమ్మడిగా ఆడుతున్న నాటకమే జలయుద్ధమని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. వాస్తవంగా ఇరు ముఖ్యమంత్రులు చేస్తున్నది జలయుద్ధం కాదని, జగన్నాటకమని రేవంత్ రెడ్డి చమత్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాస్తవ పరిస్ధితులను ప్రధాన మీడియా బహిర్గతం చేయకపోయినా సోషల్ మీడియా బయటపెడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అటు ఏపిలో ఇటు తెలంగాణలో వాడివేడి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

English summary
Congress MP Revanth Reddy criticized the Andhra and Telangana Governments.AP CM Jagan Mohan Reddy and Telangana CM Chandrasekhar Rao have been inherently friendly and dismissed as creating a confrontational atmosphere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X