హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bowenpally Kidnap case:మైసూరులో ఏ3 భార్గవ్ రామ్..? అఖిల ప్రియకు బెయిల్ వస్తుందా..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఏ1గా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలిప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిగా పేర్కొంటూ ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏ3గా ఉన్న భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉన్నాడు. ఇక భార్గవ్ రామ్ జాడ కనుగొనేందుకు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. అయితే బెంగళూరులో భార్గవ్‌రామ్ ఉన్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. తాజాగా భార్గవ్ రామ్ మైసూరులో తలదాచుకున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసుల బృందం మైసూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే తాను గర్భవతి అయినందున తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సికింద్రాబాద్ కోర్టులో భూమా అఖిల ప్రియ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

Bowenpally Kidnap Case:A3 Bhargav Ram is in Mysore,Telangana Police departs to karnataka

హఫీజ్ పేటలోని ఓ భూవివాదమే సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్‌నకు కారణమైంది. అయితే ఆ భూమి తమదంటూ భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. ఇక అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. మైసూరులో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు అతని కోసం జల్లెడ పడుతున్నారు. భార్గవ్ రామ్‌తో పాటు మరో నలుగురు శ్రీనివాస్ చౌదరి, సాయి, చంటి, ప్రకాష్‌లు కూడా పరారీలో ఉండటంతో వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

భూమా అఖిల ప్రియను... ఆమె భర్త భార్గవ్ రామ్‌ను అరెస్టు చేయకుంటే మరిన్ని నేరాలకు పాల్పడి ఉండేవారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ రావును కిడ్నాప్‌ చేసేందుకు పక్క ప్లాన్ ఆరు నెలల క్రితమే సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. అదే సమయంలో ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను పలుమార్లు కారులో రెక్కీ నిర్వహించాడని, కారు నెంబర ప్లేటు మార్చి మరీ రెక్కీ నిర్వహించడంతో పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి.

English summary
Bhargav ram who is said to be the A3 in Bowenpally Kidnap case had been traced in Mysore according to sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X