హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూ తగదా కాటేసిందా.. పార్ట్‌నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాం ప్రసాద్ హత్యపై ఆయన బిజినెస్ పార్ట్‌నర్ కోగంటి సత్యంపై పోలీసులు మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితో మధ్యలో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి వచ్చి రాం ప్రసాద్‌ను చంపింది తామేనంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.

చివరకు రాం ప్రసాద్ హత్య కేసులో బిజినెస్ పార్ట్‌నర్ కోగంటి సత్యం సూత్రధారి అని తేల్చారు పోలీసులు. ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దృష్టి సారించగా అసలు విషయం వెలుగు చూసింది.

రాం ప్రసాద్ హత్యకేసు తేల్చిన పోలీసులు

రాం ప్రసాద్ హత్యకేసు తేల్చిన పోలీసులు


స్టీల్ వ్యాపారి రాం ప్రసాద్‌ హత్యకేసులో చిక్కుముడి వీడింది. ప్రధాన నిందితుడు కోగంటి సత్యమేనని తేల్చారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఎన్నో ట్విస్టులు బయటకొచ్చాయి. అయితే సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కోగంటి సత్యంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. మొదటినుంచి కూడా అతడిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అనుకున్నట్లే జరిగింది. ఈ కేసును పక్కదారి పట్టించాలని ప్రయత్నించినా.. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో అసలు నిందితుల గుట్టురట్టైంది.

రాం ప్రసాద్ హత్యకు భూ వివాదమే కారణమని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాసరావు వివరించారు. ఆయన హత్యకు నెల రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం చేశారు.

కోట్లు స్వాహా.. నామినేటెడ్ పోస్టు ఊసు లేదు.. మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్..!కోట్లు స్వాహా.. నామినేటెడ్ పోస్టు ఊసు లేదు.. మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్..!

స్టీల్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం.. అదే కొంప ముంచిందా?

స్టీల్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం.. అదే కొంప ముంచిందా?


రంగారెడ్డి జిల్లా పరిధిలోని పరిగిలో రాం ప్రసాద్‌కు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. కోగంటి సత్యంతో కలిసి చాలా సంవత్సరాలు వ్యాపారం చేశారు. అయితే ఆయనతో తలెత్తిన విభేదాల వల్లే రాం ప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ క్రమంలో పగ తీర్చుకునేందుకు అదనుకోసం వేచి చూసిన సత్యం హైదరాబాద్‌లో స్పాట్ పెట్టాలని డిసైడయ్యారు. ఆ మేరకు తనపై అనుమానం రాకుండా మర్డర్ చేయించాలని ప్లాన్ వేశాడు.

అయితే మొదట సత్యంతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావించారు. కానీ దర్యాప్తులో సత్యం సూత్రధారి కాగా మిగతా ముగ్గురు రాం ప్రసాద్‌ను అంతమొందించారు. శ్యామ్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కలిసి రాం ప్రసాద్‌ను మర్డర్ చేశారు. ఆ సమయంలో సత్యం సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రి దగ్గర వెయిట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

 పగ తీర్చుకున్నాడు.. 10 లక్షలకు సుపారీ

పగ తీర్చుకున్నాడు.. 10 లక్షలకు సుపారీ


రాం ప్రసాద్‌ను హత్య చేసేందుకు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాన నిందితుడు కోగంటి సత్యం ఒప్పుకున్నారు. ఈ మర్డర్ కేసులో మొత్తం 11 మంది నిందితులని తేల్చారు పోలీసులు. ఆ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారి నుంచి మూడు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సత్యంపై మొత్తం 21 కేసులున్నట్లు తేల్చారు.

రాం ప్రసాద్ మర్డర్ కేసును తప్పుదోవ పట్టించేందుకు మధ్యలో శ్యామ్ ఎంట్రీ ఇచ్చాడు. తన బావ శ్రీనుకు రాం ప్రసాద్ 15 లక్షలు బాకీ ఉన్నాడని.. అతడిని చంపితే ఆ మొత్తం వస్తుందని ఆయన చెప్పడంతోనే ఈ మర్డర్ చేసినట్లు మీడియాను తప్పుదారి పట్టించాడు. ఆ క్రమంలో శ్యామ్ చెప్పినదాంట్లో నిజం లేదనుకుని కోగంటి సత్యంపైనే దృష్టి సారించారు. చివరకు పోలీసులు అనుకున్నట్లే జరిగింది. కోగంటి సత్యంను ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు.

English summary
Business Man Ram Prasad Murder Revealed by Hyderabad Police. Business Partner Koganti Satyam is main convict in this case, DCP srinivasa rao says. Land Issue may casue to ram prasad murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X