హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు... గజ్వేల్ నుండి ప్రారంభం : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించారు. నియెజకవర్గంలోని ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదర్శ నియోజకవర్గంగా గజ్వేల్

ఆదర్శ నియోజకవర్గంగా గజ్వేల్

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సంధర్భంలోనే ప్రతి వ్యక్తికి ఉద్యోగం లభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామాన్ని స్వయం సంవృద్ది దిశగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రానున్న కొద్ది రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు గ్రామానికి చెందిన వారితో ఒక్కరోజు మొత్తం సమావేశం అవుతానని సీఎం చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రోఫైల్

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రోఫైల్

సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించినట్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయాలనే ఆకాంక్ష ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రారంభించనుున్నట్టు తెలిపారు. త్వరలో నియోజకవర్గ ప్రజలకు హెల్త్ ప్రోఫైల్ చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి ఈటల రాజెందర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతిఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వార ప్రజలకు అనేక ప్రయోజనాలు కల్గుతాయని సీఎం వివరించారు.

 నియోజవర్గంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు

నియోజవర్గంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు


గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చేదిద్దే క్రమంలో ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మరోవైపు నియోజకవర్గంలోని కొండపాకలో ఉన్న సుమారు 7500 ఎకరాల్లో వనమూలికల పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక జనవరిలో కాళేశ్వరం నీళ్లు రానున్నాయని, ఇందుకోసం రైతులు సహకరించి కాలువలు తవ్వేందుకు భూములు ఇవ్వాలని కోరారు.

English summary
The Chief Minister KCR visited his own Gajwel constituency .cm inagurated a newly built forest college and research center in Mulugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X