హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలకు పాల్పడగా.. మస్కట్ నుంచి వచ్చిన వివాహిత కనిపించకుండా పోవడం చర్చానీయాంశమైంది.

ఎయిర్‌పోర్టులో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. 18 ఏళ్ల సదరు యువతిపై అత్యాచారం చేయబోయాడు. డ్యూటీ అయిపోగానే ఇంటికెళ్లే క్రమంలో ఆ యువతి క్యాబ్ బుక్ చేసుకుంది. సల్మాన్ అనే డ్రైవర్ ఆమెను కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. దారి మధ్యలో కారు ఆపి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బలవంతంగా రేప్ చేయబోయే ప్రయత్నం చేశాడు.

cab driver rape attempt on shamshabad airport employee and one woman missing

8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు

ఊహించని పరిణామంతో షాక్ తిన్న సదరు యువతి గట్టిగా కేకలు వేసింది. దాంతో భయపడ్డ క్యాబ్ డ్రైవర్ పరుగులు పెట్టాడు. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. దాంతో ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి క్యాబ్ డ్రైవర్ సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. విమానశ్రయానికి రాకపోకలు సాగించేవారు పోలీస్ శాఖ అనుమతించిన క్యాబ్స్‌లోనే ప్రయాణించాలని ఎయిర్‌పోర్ట్ ఏసీపీ అశోక్‌కుమార్ గౌడ్ సూచించారు. తద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడొచ్చని తెలిపారు.

అదలావుంటే మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 28 సంవత్సరాల భవాని అనే మహిళ అదృశ్యమైంది. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు భర్త భీమ్‌రావు విమానాశ్రయానికి వచ్చారు. ఎంత సేపు వెయిట్ చేసినా భార్య మాత్రం కనిపించలేదు. భవాని ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అనే సమాధానం వచ్చింది. దాంతో కంగారుపడ్డ భీమ్‌రావు విషయాన్ని వివరిస్తూ ఎయిర్‌పోర్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Two Incidents at Hyderabad's Shamshabad Airport turned as hot topic. Cab Driver attempts rape on 18 years old girl who worked in Shamshabad Airport. One Married Woman Missing from Airport who came from muscat. These Two Incidentes filed in Airport Police Station. The police were started investigation, cab driver arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X