హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జమ్మూకశ్మీర్‌లో హైదరాబాదీ భూమి కొనొచ్చు, సిటీ పేరును భాగ్యనగరంగా మారుస్తాం: యోగీ

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో బీజేపీకి అధికారం అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. తమకు పట్టం కడితే హైదరాబాద్ భాగ్యనగరం చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో హైదరాబాదీ భూమి కొనొచ్చు అని చెప్పారు. ఇప్పటికే పలు నగరాల పేర్లు మార్చామని.. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం ఎందుకు కాకుడదని అడిగారు. మూసీ నదిని ఎంఐఎ:, టీఆర్ఎస్ కబ్జా చేశాయని ఆరోపించారు. అవినీతి లేని పాలన కోసం బీజేపీకి విజయం అందించాలని కోరారు. బీజేపీని గెలిపించి ఢిల్లీ నుంచి నిధులను తెచ్చుకోవాలని సూచించారు.

Recommended Video

Hyderabad Renamed As Bhagyanagar జమ్ముకశ్మీర్‌లో హైదరాబాదీ భూమి కొనొచ్చు : CM Yogi

సీఎం కేసీఆర్‌పై యోగి ఆదిత్యనాథ్ ఫైరయ్యారు. ఆవాస్ యోజన కింద కేసీఆర్ సర్కార్ పేదలకు ఎందుకు ఇళ్లు కట్టలేదని అడిగారు. అదే యూపీలో 15 లక్షల ఇళ్లు నిర్మిచామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే తెలంగాణ సర్కార్ వరద సాయం నగదు పంపిణీ చేసిందని తెలిపారు. నిజాం రూపంలో మరో నిజాం కేసీఆర్ అని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పారు.

 Came here to turn Hyderabad into BhagyanagarUP CM Yogi

దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్ వాసుల ఉత్సాహం చూస్తే ఆనందంగా ఉందన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సర్దార్ పటేల్‌తో సాకారమైందని చెప్పారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిషా కలిసి ఆర్టికల్ 370 తొలగించారని పేర్కొన్నారు. 400 ఏళ్లకుపైగా కార్యరూపం దాల్చని అయోధ్య రామమందిరం నిర్మించుకుంటున్నామని చెప్పారు.

హిందుస్తాన్ అనని వాళ్లతో కేసీఆర్ దోస్తి చేస్తున్నారని యోగి విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతంగా నియంత్రించారని తెలిపారు. కేసీఆర్‌కు పేదలపై ప్రేమలేదని దుయ్యబట్టారు. గత ఆరేళ్లలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచామని తెలిపారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath said he came to the capital city of Telangana to turn Hyderabad into 'Bhagyanagar'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X