హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గచ్చిబౌలి జంక్షన్‌లో కారు బీభత్సం .. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి హంగామా ...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చేతిలో కారు ఉంటే చాలు గాలిలో తేలిపోతుంటారు పోకిరిలు. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటేనే వారికి చిరాకు. ఎదురుగా ఏ వాహనం వస్తున్న లెక్కచేయరు. తమ ముందు ఏ వాహనం ఉన్న పట్టించుకోరు. కాసేపటి క్రితం హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కారులో ఉన్న యువకులు గచ్చిబౌలిలో బీభత్సం సృష్టించారు.

క్షణకాలంలో ..
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్. ఎప్పుడూ ఇక్కడ రద్దీగానే ఉంటుంది. అయితే అటు నుంచి ఓ హోండా కారు వచ్చింది. తమ ఎదురుగా ఉన్నఎస్‌యూవీ వాహనాన్ని ఢీ కొట్టింది. సరే కుర్రాళ్లు అని అనుకొందామనుకుంటే .. కారును ఎక్స్‌లేటర్ తొక్కేశారు. తమ ముందు ఎవరు ఉన్నారు ? ఏం చేస్తున్నామే విచక్షణ మరిచారు.

car dash in suv in gachibowli junction

సీదా కారును పొనిచ్చారు. వారు ఆగడాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారును ఢీ కొని అపోజిట్ లైన్‌లో కారు వెళ్లిపోయింది. ఫుట్‌పాత్ మీద నడుస్తున్న పాదాచారులు .. తమపైకి కారు రావడంతో బెంబేలెత్తిపోయారు. నలుగురు పాదాచారులను ఢీ కొట్టి భయాందోళన సృష్టించారు. అక్కడినుంచి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు కూడా డ్యాష్ ఇచ్చి వెళ్లిపోయారు.

రెప్పపాటులో ...
క్షణకాలంలో ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి. అచ్చం గచ్చిబౌలిలో కారు బీభత్సం అలానే సాగింది. తొలుత ఎస్‌యూవీ వాహనాన్ని ఢీకొని .. అక్కడినుంచి పాదచారులపైకి దూసుకెళ్లింది. కానిస్టేబుల్‌‌ను ఢీకొని వెళ్లిపోయింది. ఈ కారు హోండా అని .. నెంబర్ ఏపీ 28 ఏవై 9877గా ఫుటేజీలో రికార్డైంది. ఈ నంబర్ ఆధారంగా పోలీసులు కారు ఎవరిదని శోధిస్తున్నారు. మరోవైపు కారు ఏ వైపు వెళ్తుంది ? అందులో ఎవరున్నారే అంశాన్ని గంటల్లో కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.

English summary
Triple IT Junction in Gachibowli. It's always crowded here. But a Honda car came from the graft. The SUV hit the vehicle in front of them. suppose the car was excavator. Who's in front of them? What is being done is discretion. The car was burned. They were recorded in the TV camera. The car crashed and the car went off on the Apposite Line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X