హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న బయో డైవర్సిటీ..నేడు భరత్‌నగర్: ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డ కారు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి ఓ కారు ఏ రకంగా కిందికి దూసుకెళ్లిందో చూశాం. అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఈ సారి భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై నుంచి కిందికి పడింది ఓ కారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కడప జిల్లాలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు: మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్న ఫ్రెంచ్ సంస్థ.. !కడప జిల్లాలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు: మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్న ఫ్రెంచ్ సంస్థ.. !

మృతుడిని సోహెల్‌గా గుర్తించారు. బోరబండలోని పండిట్ నెహ్రూనగర్‌కు నివాసిగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మూసాపేట్ వైపు నుంచి సనత్‌నగర్ వస్తుండగా అతి వేగానికి కారు అదుపు తప్పింది. భరత్‌నగర్ ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. అంత పైనుంచి కిందపడటంతో కారు నుజ్జునుజ్జయింది.

Car flies off flyover in Hyderabad, One died, four injured

Recommended Video

Fake Notes : What To Do If You Find Yourself With Fake Cash | ATM లో దొంగ నోటు వస్తే ? | Oneindia

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు కింద పడిన సమయంలో సంఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

English summary
Another road horror accident happened in Hyderabad. After Bio diversity flyover incident, another car jumped from Bharat Nagar Flyover in Hyderabad. One died and four injured in this accident. Speedy car jumped from the Flyover. Sohail, resident of Pandit Nehru Nagar of Borabad area died on the spot. Another four persons injured. Injured persons shifted to Gandhi Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X