హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్ లో బాలుడిపై దూసుకెళ్లిన కారు .. తీవ్ర గాయాలపాలైన బాలుడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ పాతబస్తీలోని కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందున్న బాలుడ్ని ఒక కారు రివర్స్ లో ఢీకొట్టింది. ఈనెల 12వ తేదీన హైదరాబాద్లో ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలోని
శంషీర్ గంజ్ ప్రాంతంలోని ఓ ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు .

Recommended Video

హైదరాబాద్: రివర్స్ గేరులో బాలుడిపైకి దూసుకెళ్లిన కారు..సీసీటీవీ దృశ్యాలు

ఏడుగురికి జీవితాలను గిఫ్ట్ గా ఇచ్చిన రెండేళ్ళ బాలుడుఏడుగురికి జీవితాలను గిఫ్ట్ గా ఇచ్చిన రెండేళ్ళ బాలుడు

బయట ఉన్న చిన్నారుల మీదికి కారు ఒక్కసారిగా రివర్స్ రావడంతో చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో ఒకరు అక్కడి నుండి పక్కకు పరిగెత్తి తప్పించుకోగా, మరొక బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన చిన్నారికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కాలా పత్తర్ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసి టివి ఫుటేజ్ లో రికార్డయ్యాయి.ఇప్పటికే పలు సందర్భాల్లో కారు రివర్స్ తీస్తున్న క్రమంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

Car moving in reverse runs over a Boy.. he injured severely

ముఖ్యంగా ఇలాంటి ఘటనల్లో చిన్న పిల్లలు బలవుతున్నారు. చిన్నారుల ఎత్తు కనిపించకపోవడం, వారు ఆడుకుంటూ వెనక్కు వస్తున్న కారును గమనించకపోవడం ,ఇక కారు నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి ఇలాంటి ఘటనల్లో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది వాహనదారులు తమ సొంత బిడ్డలను సైతం కోల్పోయారు.

English summary
An atrocity took place at the Kala Pathar police station in the old city of Hyderabad. A boy in front of the house was hit by a car in reverse. The incident took place in Hyderabad on the 12th of this month but it came to light late. A boy was seriously injured in an incident in which two children were playing in front of a house in Shamshir Gunj area of ​​Hyderabad old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X