హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ అలా మాట్లాడితే ఊరుకోం..! జనసేనానిపై తెలంగాణలో కేసు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ పై కేసు పెట్టిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు ! | Oneindia Telugu

హైదరాబాద్ : ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడే తీరు సరికాదని మండిపడ్డారు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు. శుక్రవారం భీమవరం సభలో తెలంగాణలో ఆంధ్ర ప్రజలపై దాడులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా పాకిస్థానా అంటూ పవన్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 కర్ణాటకలో కర్ణాటకలో "ఓలా" కు బ్రేక్.. 6 నెలలు నిషేధం..!

భారతదేశంలోని ఇతర 28 రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. తెలంగాణలో సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు అడ్వకేట్ జేఏసీ నేతలు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీకి వెళ్లిన సమయంలోనూ ఏ ఒక్కరిపై దాడులు జరగలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ సఖ్యతగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనలతో.. ఓట్ల కోసం రాజకీయం చేయడం తగదని, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని హితవు పలికారు.

Case filed against Pawan Kalyan in jubileehills ps for inflammatory statements on Telangana

ప్రశాంతంగా ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య పవన్ కల్యాణ్ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ లో ఆంధ్రవారికి చెందిన భూములు ఎవరు లాక్కున్నారో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Jubilee Hills police officials have received a complaint on Saturday from Telangana advocate JAC against Pawan Kalyan, the president of Janasena party. Pawan Kalyan who is currently campaigning in Bheemavaram made some objectionable comments on Telangana people that they are attacking Andhra people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X