హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎలో మ్యాచ్ తప్పతాగి చిందులేసిన తెలుగు టీవీ యాంకర్.. కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

IPL 20191 : Case Filed On Telugu TV Anchor Prashanthi For Creating Nuisance At Uppal Stadium

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పోటెత్తారు . వేలాదిమంది క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు ఫుల్ గా తాగేసి నానా రచ్చ చేశారు.

తాగి రచ్చ చేసిన వారిలో ఉన్న తెలుగు టీవీ యాంకర్ ప్రశాంతి

తాగి రచ్చ చేసిన వారిలో ఉన్న తెలుగు టీవీ యాంకర్ ప్రశాంతి

ఉప్పల్ స్టేడియంలో తాగి రచ్చ చేసిన వారిలో ఒక తెలుగు టీవీ యాంకర్, నటి ప్రశాంతి కూడా ఉన్నట్టు సమాచారం .ఆరుగురు యువతీయువకులు మద్యం మత్తులో చాలా అసభ్యంగా ప్రవర్తించి అక్కడఉన్న వారికి చిరాకు తెప్పించారు . వారి ప్రవర్తనను తట్టుకోలేని ఓ ప్రేక్షకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.

 ఉప్పల్ స్టేడియం సాక్షిగా తప్పతాగి వెకిలి చేష్టలు చేసిన యువతీ యువకులు

ఉప్పల్ స్టేడియం సాక్షిగా తప్పతాగి వెకిలి చేష్టలు చేసిన యువతీ యువకులు

భాగ్య నగరంలో యువకులతో పాటు యువతులు కూడా బరితెగిస్తున్నారు అని చెప్పటానికి ఈ ఘటన ఒక ఉదాహరణ . యువతులుసైతం ఫుల్ గా తాగి వీరంగం వేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం సాక్షిగా అసభ్యంగా ప్రవర్తించారు యువతులు . హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్ చూసేందుకు నగరానికి చెందిన పూర్ణిమ, ప్రియ, యాంకర్ ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌లు ఉప్పల్ స్టేడియంలోకి వచ్చారు . అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వీరి చేష్టలు గ్యాలరీలోని ఇతర ప్రేక్షకులకుచిరాకు తెప్పించాయి. అసలు ఆడవారేనా అని ఫీల్ అయ్యేంత దారుణంగా వారి ప్రవర్తన ఉండటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు .

యువతీయువకుల వెకిలి చేష్టలు వీడియో వైరల్

పూర్తిగా మైకంలో ఉన్న యాంకర్ ప్రశాంతి చాలా అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు, సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో వీరు అసభ్యంగా ప్రవర్తించారు. గొడవ పది బండ బూతులు తిట్టారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో రాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒక ప్రేక్షకుడి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

ఒక ప్రేక్షకుడి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

ఆరుగురు యువతీ, యువకులు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టటం ,కూర్చొని మ్యాచ్ చూడకుండావెకిలి చేష్టలు చేయటంతోపాటు , తనను సైతం ఇబ్బంది పెట్టటంతో చూడలేక తీవ్ర ఆగ్రహానికి గురైన సంతోష్ ఉపాధ్యాయ విధుల్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు యాంకర్ ప్రశాంతితో పాటు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లను కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

English summary
The Rachakonda Commissionerate Uppal Police on Sunday registered cases against six persons including a telugu TV anchor Ch Prashanthi by consuming alcohol and obstructing the complainant and threatening him during the IPL cricket match at Sunday at Rajiv Gandhi Cricket Stadium in Uppal.According to police, they received a complaint from Santosh Upadhyay , stating that six persons have consumed alcohol at Uppal Cricket Stadium and created nuisance by obstructing him and not allowing him corridor to watch cricket match by abusing in filthy language and by threatening him with dire consequence and violated the rules and regulations duly promulgate by public servant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X