హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఆడియో టేపుల పరిశీలన..

|
Google Oneindia TeluguNews

మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా కూడా కోర్టుకు వచ్చారు. ఓటుకు నోటుకి కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. వాటిని ఏసీబీ కోర్టు పరిశీలించింది.

బెయిల్ రావడంతో..

బెయిల్ రావడంతో..


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రస్తుతం బెయిల్‌ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 2015లో ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వద్దకు రేవంత్ రెడ్డి అండ్ కో సంప్రదించారు. టీడీపీ-బీజేపీ అభ్యర్థిని గెలిపిచాలని కోరారు. అందుకోసం రూ.5 కోట్లకు ఒప్పందం చేసుకొని..అడ్వాన్స్‌గా 2015 మే 31వ తేదీన రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే విషయం ముందే ఏసీబీకి తెలియడంతో.. వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి సహా.. నగదు తీసుకొచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి..

ఈ కేసు అప్పట్లో దుమారం రేపింది. అయితే రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగతావారు కూడా బయట ఉన్నారు. కానీ మారిన పరిస్థితులతో.. రేవంత్ రెడ్డి టీడీపీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న కేసు.. మరోసారి విచారణకు వచ్చింది. దీంతో ఇవాళ కోర్టుకు రేవంత్ రెడ్డి సహా మిగతావారు హాజరయ్యారు.

చంద్రబాబు ఆడియో..

చంద్రబాబు ఆడియో..

ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. చంద్రబాబు పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పటి విపక్ష నేత జగన్ అస్త్రంగా మలచుకున్నారు.

143 మందిపై కేసులు

143 మందిపై కేసులు


రేవంత్ రెడ్డి సహా తెలంగాణ రాష్ట్రంలో 143 మంది నేతలపై కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 4 వేల 859 మందిపై కేసులు ఉన్నాయి. నాంపల్లిలో గల స్పెషల్ సెషన్స్ కోర్టు ప్రతీ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై గల కేసులను విచారిస్తోంది.

English summary
Cash for vote: Telangana Congress working president and MP Revanth Reddy has appeared before ACB court in Hyderabad today in cash for vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X