హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింధూ శర్మ అత్తింటి వేధింపుల కేసులో సంచలన వీడియో .. విడాకుల కేసు ఈనెల 24కి వాయిదా

|
Google Oneindia TeluguNews

Recommended Video

సింధూ శర్మ అత్తింటి వేధింపుల కేసులో సంచలన వీడియో

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన కోడలు సింధూ శర్మ తన పిల్లల కోసం పోరాటానికి దిగిన విషయం తెలిసిందే . సింధూ శర్మ మహిళా సంఘాలతో కలిసి అత్తింటి ముందు ధర్నా చేసి తన పిల్లలను తనకు అప్పగించాలని కోరటం , ఆమెను వేధింపులకు గురి చేసింది సాక్షాత్తు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నూతి రామ్మోహన్ రావు కుటుంబం కావటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఇక ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

కచ్చులూరులో 144 సెక్షన్ ... బోటు వెలికితీత పనులు నిలిపివేత ..జలసమాధిలోనే 16మందికచ్చులూరులో 144 సెక్షన్ ... బోటు వెలికితీత పనులు నిలిపివేత ..జలసమాధిలోనే 16మంది

 కోడలిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి కుటుంబం దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్

కోడలిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి కుటుంబం దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్


నూతి రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ మరియు మద్రాస్ హైకోర్టులలో పనిచేశారు మరియు ఏప్రిల్ 2017 లో పదవీ విరమణ చేశారు. రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు తో పాటు తన భార్య, కొడుకుపై కోడలిని వేధించి, దాడి చేశాడనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఐదు నెలల క్రితం కేసు నమోదు చేశారు. ఈ దాడి యొక్క సిసిటివి ఫుటేజ్ శుక్రవారం బయటపడింది. ఏప్రిల్ 20, 2019 నాడు జరిగిన ఘటనగా బయటకు వచ్చిన వీడియో ఫుటేజ్‌లో రామ్మోహన్ రావు , అతని భార్య , మరియు కుమారుడు వశిష్ట కోడలు ఎం సింధు శర్మ మీద దాడి చేస్తున్నట్టు ఉంది .

భర్త, అత్తమామలు సింధూ శర్మపై దాడి చేస్తున్న దృశ్యాలు

భర్త, అత్తమామలు సింధూ శర్మపై దాడి చేస్తున్న దృశ్యాలు

2.20 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, రామ్మోహన్ రావు కుమారుడు ఎన్ వశిష్ట తన భార్య సింధుపై వారి ఇంటి వద్ద ఘర్షణ పడి మధ్యలో ఆమెపై దాడి చేస్తున్నట్లు వీడియో ఫుటేజ్ లో కనిపిస్తుంది. అలాగే రామ్మోహన్ రావు, మరియు అతని భార్య దుర్గా జయలక్ష్మి అటు ఇటు తిరుగుతూ , తరువాత వారి ఘర్షణలో జోక్యం చేసుకుని వారు సైతం ఆమెపై దాడికి పాల్పడ్డారు. వశిష్ఠ తన భార్య సింధును కొట్టడం కనబడుతుండగా, రావు ఆమె చేతులు లాగి సోఫాలోకి బలంగా నెట్టడం వీడియో ఫుటేజ్ లో ఉంది .వీడియో చివరలో, శర్మ కుమార్తె ఏడుస్తూ గదిలోకి ప్రవేశించి ఆమె తల్లిని పట్టుకుని కొట్టవద్దని ప్రాదేయపడుతున్నా వినకుండా ఆ చిన్నారిని గది నుండి బయటకు పంపించారు . ఇక ఈ వీడియో బయటకు రావటంతో ఆమెపై జరిగిన గృహ హింస అందరికీ తెలిసింది.

అదనపు కట్నం కోసం నరకం చూపించారన్న సింధు తండ్రి.. కొనసాగుతున్న విచారణ

అదనపు కట్నం కోసం నరకం చూపించారన్న సింధు తండ్రి.. కొనసాగుతున్న విచారణ

సింధు తండ్రి రిటైర్డ్ న్యాయమూర్తి తన భార్య దుర్గా లక్ష్మితో పాటు నా కుమార్తెను చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు . అదనపు కట్నం కోసం నుండి వారు చాలా సంవత్సరాలు ఆమెను వేధిస్తున్నారు, కానీ ఆమె అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించింది కాబట్టి ఆమెను ఈ విధంగా నరకం చూపించారని ఆవేదన చెందారు .ఈ ఏడాది ఏప్రిల్‌ 20న అదనపు కట్నం కోసం సింధూ శర్మను ఆమె భర్త వశిష్ట, మామ నూతి రామ్మోహన్‌ రావు, అత్త జయలక్ష్మి దారుణంగా చిత్రహింసలు పెట్టి వేధించారంటూ హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదు నమోదు అయ్యింది .

సింధూ శర్మ విడాకుల కేసు 24వ తేదీన విచారణ

ఇక మరోవైపు వశిష్ట సింధూ శర్మ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ రిటైర్డ్ జడ్జ్ నూతి రామ్మోహన్ రావు కుమారుడు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పిల్లలను తనవద్దకు పంపాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలంటూ సింధూ శర్మ న్యాయవాదికి సైతం సూచించింది.

English summary
Retired Judge Nuti Ramohan Rao daughter in law sindhu sharma filed a case against her father in law and family for domestic violence . Almost five months after Justice (retired) Nooty Rama Mohan Rao, along with his wife and son, was booked by Hyderabad police for allegedly harassing and assaulting his daughter-in-law, CCTV footage of the assault surfaced Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X