హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా?: సీసీఎంబీ కీలక అధ్యయనం, క్లోజ్డ్ హాల్స్, మాల్స్‌లోనా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. కరోనా వ్యాప్తి కట్టడికి, వ్యాక్సిన్ కోసం, ఏ విధంగా వ్యాప్తి చెందుతోందనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కూడా కీలక అంశంపై అధ్యయనం ప్రారంభించింది.

ఏపీలో తగ్గిన కరోనా: జిల్లాల వారీగా కొత్త కేసులు, టెస్టులు పెంచినా.., తగ్గిన యాక్టివ్ కేసులుఏపీలో తగ్గిన కరోనా: జిల్లాల వారీగా కొత్త కేసులు, టెస్టులు పెంచినా.., తగ్గిన యాక్టివ్ కేసులు

గాలిలో ద్వారా కరోనా వ్యాప్తి ఎలా?

గాలిలో ద్వారా కరోనా వ్యాప్తి ఎలా?

ముఖ్యంగా గాలిలో వైరస్ వ్యాపిస్తుందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ వ్యాప్తిసే.. ఎంతసేపు, ఎంతదూరం దాని ప్రభావం ఉంటుందనే విషయాలు సీసీఎంబీ పరిశోధనల్లో వెల్లడికానున్నాయి. గాలిలో వైరస్ వ్యాప్తి జరుగుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో సీసీఎంబీ ఈ మేరకు పరిశోధనలు చేస్తోంది. అయితే, కొందరు శాస్త్రవేత్తలు మాత్రం గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

ఒక వేళ గాలి ద్వారా కరోనా వ్యాపిస్తే..

ఒక వేళ గాలి ద్వారా కరోనా వ్యాపిస్తే..

ఆస్పత్రి పరిసరాల్లో పాజిటివ్ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్ ఎలా వ్యాపిస్తుందో అని విషయాన్ని తేల్చేందుకు సీసీఎంబీ ఈ పరిశోధనలు ప్రారంభించింది. తాజా అధ్యయనం ప్రారంభించి పది రోజులైందని.. ఒక వేళ గాలిలో వైరస్ వ్యాపిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకే ఈ పరిశోధన చేస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా పోరులో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బందికి సహాయం చేసేందుకు ఈ అధ్యయనం తోడ్పడుతుందన్నారు.

Recommended Video

COVID-19 : China లో బయటపడ్డ ప్రమాదకర బ్యాక్టీరియా.. ఇతర దేశాలకు వ్యాపిస్తుందా..? || Oneindia Telugu
వైద్య సిబ్బందిిక మేలు చేసే ఈ అధ్యయనం ఇలా కొనసాగుతోంది

వైద్య సిబ్బందిిక మేలు చేసే ఈ అధ్యయనం ఇలా కొనసాగుతోంది

ఈ పరిశోధన కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక ఎయిర్ శాంపర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐసీయూ, కోవిడ్ వార్డులతోపాటు వైరస్ వ్యాప్తికి వీలున్న ప్రదేశాల్లో వీటిని సేకరిస్తున్నారు. వీటి ద్వారా రెండు నాలుగు, 8 మీటర్ల దూరాల్లో వైరస్ ప్రభావాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా గాలిలో వైరస్ ఎంతసేపు ఉంటుందో తెలుసుకోవడంతోపాటు ఎంత దూరం ప్రయాణించగలదనే విషయాన్ని తేల్చనున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బబంది కరోనా బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించిన వివరాలు ఈ అధ్యయనంలో వెల్లడి కానున్నాయి.

తొలి స్టడీ ఫలితాల తర్వాత.. క్లోజ్డ్ హాల్స్, మాల్స్‌పై...

తొలి స్టడీ ఫలితాల తర్వాత.. క్లోజ్డ్ హాల్స్, మాల్స్‌పై...

అంతేగాక, మరిన్ని మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు మరిన్ని మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తామని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, తొలి అధ్యయనం ఫలితాలు వచ్చాక.. క్లోజ్‌డ్ హాళ్లు, బ్యాంకులు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆయా ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరిస్తామని సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు.

English summary
CCMB scientists launch study to check whether covid 19 can travel in air, if so how far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X