హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు-బైక్ ఢీ: ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు.. వాహనానికి లేని నంబర్ ప్లేట్...

|
Google Oneindia TeluguNews

కళ్లు మూసి తెరిచేలోపు జననం, మరణం.. కొన్ని ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. దీంతో కొందరు చనిపోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. గాయపడ్డ వారు కోలుకోవడం దేవుడెరుగు.. గాయాలు తగ్గడానికి చాలా సమయం పడుతోంది. అయితే నిన్న హైదరాబాద్ సైబర్ టవర్స్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి జరిగింది. టూ వీలర్‌ను కారు ఢీ కొంది. బైక్ నడుపుతోన్న వ్యక్తి అక్కడికక్కడడే చనిపోగా.. అతని భార్య తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతోంది.

 కారు-బైక్ ఢీ..

కారు-బైక్ ఢీ..

బైక్ మీద గౌతమ్ దేవ్ దంపతులు ఉన్నారు. గౌతమ్ దేవ్ సికింద్రాబాద్‌లో క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నిన్న భార్యతో కలిసి కొండాపూర్ వైపు వెళుతున్నారు. అయితే ట్రాఫిక్ సిగగ్నల్ జంప్ చేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సంలో కూకట్ పల్లి వెళుతున్న మెర్సిడెస్ బెంజ్ కాు వారి బైక్‌ను ఢీ కొంది. దీంతో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని మంచం కాశీ విశ్వనాథ్ అని గుర్తించారు. అతనితోపాటు కారులో మరొకరు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే డ్రైవింగ్ చేసే సమయంలో విశ్వనాథ్ మ్యం సేవించి ఉన్నాడని ఇన్ స్పెక్టర్ పీ రవీందర్ తెలిపారు.

అక్కడికక్కడే మృతి..

అక్కడికక్కడే మృతి..

ప్రమాదం జరిగిన వెంటనే గౌతమ్ దేవ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. అతని భార్యను చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన విశ్వనాథ్‌పై మద్యం సేవించాడని, సిగ్నల్ జంప్ చేశాడని కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కూడా కేసు పెట్టారు.

లేని నంబర్ ప్లేట్

కూకట్ పల్లిలో డిన్నర్ కోసం విశ్వనాథ్ తన స్నేహితుడితో కలిసి వెళుతున్నారు. అయితే కారుకి నంబర్ ప్లేట్ మాత్రం లేదు. దీంతో ఇదీ ఎవరీ కారు అనే అనుమానం వ్యక్తమవుతోంది. చేసిస్ నంబర్ ఆధారంగా కారు ఎవరిదో కనుకుంటామని పోలీసులు తెలిపారు. ఎవరినైనా వదిలిపెట్టబోమని అధికారులు చెబుతున్నారు. కానీ గౌతమ్ దేవ్ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది.

English summary
couple on the bike jumped the Cyber Towers traffic junction signal and was proceeding towards Kondapur on his Royal Enfield bike. car rammed to bike, one dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X