హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రానికి హైదరాబాద్ గుర్తుకు రాదా... దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు వివక్ష? కేటీఆర్

|
Google Oneindia TeluguNews

కేంద్రప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన కేంద్ర వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దక్షిణభారత దేశాల రాష్ట్రాలపై కేంద్రం వైఖరి మారాలని ఆయన కోరారు. బుల్లెట్ రైలు అంటే ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలే గుర్తుకు వస్తాయా... హైదరాబాద్ గుర్తుకు రాదా అంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

రాజకీయా కారణాలతోనే రాష్ట్రంపై వివక్ష

రాజకీయా కారణాలతోనే రాష్ట్రంపై వివక్ష

ఇక అభివృద్ది ఫథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో తెలంగాణ అభివృద్దిని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్దికి కృషి చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహిస్తే... ఆయా రాష్ట్రాలు మరింత అభివృద్దిని సాధిస్తాయని ఆయన అన్నారు. అయితే కేంద్రం తీరు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉందని తెలిపారు. మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ వార్షికోత్సవ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చట్టాల అమలుపై మోడీకి ట్వీట్

చట్టాల అమలుపై మోడీకి ట్వీట్

ఇక దిశ హత్య కేసులో కూడ కేటీర్ కేంద్రానికి చురకలు అంటించారు. రెండు రోజుల క్రితమే ఆయన ప్రధానికి ట్విట్టర్ ద్వార పలు అంశాలను లేవనెత్తారు. చట్టాల్లోని లొసుగులతో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నవారు తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏడు సంవత్సరాలు అవుతున్నా... నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగపోవడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌లోనే చట్టాల సవరణ చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం


మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన రాష్ట్ర అభివృద్ది అంశాలను ప్రస్తావించారు. దేశంలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే పరిశ్రమలకు రాయితీలు ఇస్తుంటే.....దాన్ని పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నట్టుగా భావిస్తున్నారని అన్నారు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే వారిని ప్రభుత్వం పోత్సాహాకాలు అంద జేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇలా ఎస్సీ గిరిజన పారీశ్రామిక వేత్తలకు సుమారు 300 కోట్ల రూపాయల వరకు అందించామని తెలిపారు. దేశం చైనాతో పోటిపడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో మెగా పరిశ్రమలు కూడ ముందుకు రావాలని ఆయన సూచించారు.

English summary
Minister KTR fires on central government policies. He commented that the Center discriminates against southern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X