సాయి ధరమ్ తేజను పరామర్శించిన కిషన్ రెడ్డి: చార్జీషీట్ నేపథ్యంలో ప్రాధాన్యం..?
సాయిధరమ్ తేజ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సాయి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రికి సాయి కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. సాయికు కిషన్ రెడ్డి బొకే అందించగా, ఇరువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తనను కలిసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతఙతలు తెలిపారు. బిజీ షెడ్యూల్లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించిన కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ ఏడాది ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్న అని సాయి తేజ్ వివరించారు. యువ సినీ నటుడిని కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. టూ వీలర్‌పై నుంచి జారిపడి సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

ఇటు సాయిధరమ్‌తేజ్ బైక్ యాక్సిడెంట్‌పై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ సహా కీలక ఆధారాలు సేకరించారు. కేసు విచారణ నిమిత్తం సాయిధరమ్ తేజ్‌కు 91 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. సాయిధరమ్ బైక్ యాక్సిడెంట్‌పై రవీంద్ర స్పందించారు. బైక్ లైసెన్స్. ఆర్సీ, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు అన్ని వివరాలు తమకు సమర్పించాలని సాయిధరమ్ తేజ్‌కి నోటీసులు పంపినట్లు తెలిపారు. తమ నోటీసులకు ఆయన ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. సమాధానంపై కొద్దిరోజులు వేచి చూస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.
సాయి తేజ యాక్సిడెంట్‌పై చార్జీషీట్ దాఖలు అవుతున్న క్రమంలో కిషన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఇదీ పైకి మములుగానే ఉన్నా.. రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు టీఆర్ఎస్- బీజేపీ మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. మెగా కుటుంబం వైపు నిలిచారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది.