• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిజాయితీ, నిబద్ధత.. మధ్య తరగతి రైతు కుటుంబం.. కేంద్రమంత్రి వరకు కిషన్ రెడ్డి ప్రస్థానం

|

హైదరాబాద్ : రాజకీయాల్లో రాటుదేలడం అంతా ఈజీ కాదు. ఎప్పటికప్పుడు వ్యూహా ప్రతివ్యూహాలతో తమను తాము పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. రాజకీయ కుటుంబ నేపథ్యమున్నవారికి పొలిటికల్ చెస్.. వెన్నతో పెట్టిన విద్య. మరి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి లాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది.

గాడ్ ఫాదర్ లేకుండా బీజేపీలో చేరిన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి రావడం అంతా ఈజీగా జరగలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ రావడం వెనుక ఏళ్ల తరబడి కృషి దాగుంది. ఆయన పడ్డ శ్రమ ఏంటో దగ్గరగా చూసిన వారికి తప్ప ఇతరులకు తెలియదేమో. బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా కొనసాగిన కిషన్ రెడ్డి ప్రస్థానంపై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.

 కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు

కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు

రాజకీయాల్లో ఆరితేరాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి పదవి రావడమంటే కత్తిమీద సాము చేయాల్సిందే. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి విషయంలోనూ అంతే. ఆయనకు సెంట్రల్ కేబినెట్ పోస్టు ఉరికేనే రాలేదు. దాని వెనుక ఆయన చేసిన త్యాగాలెన్నో ఉన్నాయి. నిజాయతీ, నిబద్ధత ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారాయి.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కిషన్ రెడ్డిలో కించిత్తు గర్వం కనిపించదు. అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో కలియతిరిగితే కిషన్ రెడ్డి ఏంటో అక్కడి జనాలు చెప్పేస్తారు. అంతలా ఆయనకు మంచి పేరుంది. ఒకటి రెండుసార్లు చూస్తే చాలు పేరు పెట్టి పిలిచేంత చనువు తీసుకుంటారు.

-----------------

జగన్‌ సీఎం కావాలని పది సంవత్సరాలుగా.. తెలంగాణలో వీరాభిమాని ఏం చేశాడంటే..!

------------------

17 ఏళ్ల నూనుగు మీసాల వయసులో..!

17 ఏళ్ల నూనుగు మీసాల వయసులో..!

కేంద్రమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదేమో కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష ఆయనలో కనిపించడమే అందుకు కారణం. అంతెందుకు పార్లమెంటులో అడుగుపెడతానని కూడా కలగని ఉండరు. అదలావుంటే బీజేపీలో కిషన్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమని చెప్పొచ్చు.

1960లో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో యువ కార్యకర్తగా చేరారు. 17 ఏళ్ల నూనుగు మీసాల వయసులో 1977వ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం మూడేళ్లకు అంటే 1980లో బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారు. అదే సంవత్సరం బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా నియమితులై ఏడాది పాటు సేవలందించారు.

ఇక 1982 - 83 కాలానికి బీజేవైఎం కోశాధికారిగా.. 1986 - 90 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా కొనసాగారు. 1990 - 92 వరకు బీజేవైఎం అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 - 94 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కిషన్ రెడ్డి.. 1994 - 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2001 - 2002 కాలానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా సేవలందించారు. అనంతరం 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీతో పాటు దానికి అనుబంధమైన బీజేవైఎంలో వివిధ హోదాల్లో సేవలందించారు కిషన్ రెడ్డి. 2003 - 2005 మధ్య కాలంలో బీజేపీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. మోడీ కేబినెట్‌లో మంత్రి

హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. మోడీ కేబినెట్‌లో మంత్రి

ఇక పార్టీకి అంతలా సేవలందించిన కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధిగా తన హవా చాటారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు. 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి రాజకీయ పరిణామాలతో ఆయన విజయం సులువైంది. అయితే నియోజకవర్గాల పునర్ విభజన అనంతరం 2009, 2014లో అంబర్ పేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

హిమాయత్ నగర్ నుంచి ఒకసారి, అంబర్ పేట నుంచి రెండుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా తనదైన ముద్ర వేశారు. ఇక 2010 నుంచి 2014 వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలవడం కిషన్ రెడ్డికి ప్లస్ అయింది. దాంతో మోడీ కేబినెట్‌లో మంత్రిగా బెర్త్ దక్కింది.

----------------

మోడీ, అమిత్ షా మార్క్.. బార్మేర్ ఎంపీ కైలాశ్ చౌదరికి మంత్రిగా ఛాన్స్

ఒకే రూములో బస.. మోడీతో చనువు

ఒకే రూములో బస.. మోడీతో చనువు

అదలావుంటే ప్రధాని నరేంద్ర మోడీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మోడీ దగ్గర అత్యంత చనువుంది. 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేసిన సమయంలో మోడీకి దగ్గరయ్యారనే ప్రచారముంది. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలిసి పర్యటించిన నేపథ్యంలో మోడీ, కిషన్ రెడ్డి ఓకే రూములో బస చేసిన సందర్భం కూడా ఉంది. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు మెరుగుపడ్డాయి. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమనే వాదన ఉంది. మొత్తానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొలువుదీరడం పార్టీశ్రేణుల్లో, అభిమానుల్లో, సన్నిహితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Secunderabad Lok Sabha MP Kishanreddy taken oath as central minister. He is from middle class farmers family. He joined in BJP as member and held many high level posts in party. Earlier He Served the people as MLA from Hyderabad Amberpet Constituency. In 2018, December Elections He Defeated. Then He contested for Secunderabad Lok Sabha Segment and won MP seat. Now he got Central Minister Post, in this view One India Telugu giving Kishan Reddy Profile Story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more