హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వట్టి డొల్ల.. 100శాతం బోగస్.. ఆ ముష్టి మాకొద్దు.. : కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వట్టి డొల్ల.. 100శాతం బోగస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సింగపూర్ నుంచి వెలువడే ఏసియన్ ఇన్‌సైట్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఇది వట్టి బోగస్ అని పేర్కొన్నట్టు తెలిపారు. అలాగే జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనమిక్ జర్నల్ కూడా ఇదో అంకెల గారడీ అని తేల్చినట్టు చెప్పారు. ఇదో దుర్మార్గమైన ప్యాకేజీ అని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. తాము అడిగింది,కోరింది ఇది కాదన్నారు.

Recommended Video

KCR Slams Centre’s Rs 20 Lakh Cr Package

తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

ఈ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు..

ఈ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు..

కరోనా లాంటి ఘోర విపత్తు సంభవించి.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితుల్లో... రాష్ట్రాల చేతుల్లోకి నగదు వస్తే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేదన్నారు. కానీ కేంద్రం రాష్ట్రాలను బెగ్గర్స్‌లా భావించిందని విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చే పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిధిని పెంచి.. అందులోనూ దరిద్రపు కండిషన్స్ అన్నీ పెట్టారని అన్నారు. ఈ ప్యాకేజీ వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. కొత్తగా రూ.20వేల కోట్లు ఇస్తున్నట్టు చెప్పారని.. కానీ రాష్ట్రానికి ఇప్పటికే రూ.5వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.

ఆ ముష్టి మాకొద్దు..

ఆ ముష్టి మాకొద్దు..

అది కాకుండా ప్రతీ రూ.2500కోట్లకు ఒక కండిషన్ పెట్టారని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రంలో అమలుచేస్తేనే ఆ డబ్బును ఇస్తామనడం చాలా దారుణమన్నారు. ఇది సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించే ప్యాకేజీ అని చెప్పారు. కేంద్రం ఇచ్చే ఆ ముష్టి రూ.2500కోట్లు కూడా తమకొద్దని చెప్పారు. ఇదే చేయాలి.. అదే చేయాలి.. అలా అయితేనే డబ్బులిస్తామనే రీతిలో మెడ మీద కత్తి పెట్టే సంకుచిత వైఖరి సరికాదన్నారు. ఇవేం బేరసారాలని నిలదీశారు. రాబోయే రోజుల్లో ఇక పూర్తి ప్రైవేటీకరణే ఇంకేమీ ఉండదని కేంద్రం నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్ తీసుకొచ్చారని.. తెలంగాణ ఇప్పటికే పక్కాగా దాన్ని అమలుచేస్తోందని,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ముందుందని గుర్తుచేశారు.

కేంద్రం ప్యాకేజీపై విమర్శలు..

కేంద్రం ప్యాకేజీపై విమర్శలు..


కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడంతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దీని నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం వ్యవసాయ,పారిశ్రామిక రంగాలతో పాటు తదితర రంగాలకు రూ.20లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీ అంకెల గారడీయే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలకు,రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడం కూడా కేంద్రం డబ్బులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి ఐటీ రీఫండ్స్‌ను కూడా ప్యాకేజీలో భాగంగా చూపించడం దారుణమని విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ప్యాకేజీతో భారత్ లాక్ డౌన్ కష్టాల నుంచి గట్టెక్కడం ఖాయమని బలంగా వాదిస్తున్నారు.

English summary
Telangana CM KCR said central stimulus package is 100 percent bogus and nothing is there to get benifit for Telagnana. He severely criticised central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X