హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై సీఈవో, భర్త ఆచూకీ చెప్పాలని భార్య వాగ్వాదం, ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై తెలంగాణ సీఈవో రజత్ కుమార్ మంగళవారం వివరణ ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రోజు కొడంగల్‌లో బంద్‌కు పిలుపునిచ్చామని ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ స్టేట్‌మెంట్ ఇచ్చిందని చెప్పారు. దీనిపై తెరాస తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు.

ఈ ఫిర్యాదు పైన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించినట్లు రజత్ కుమార్ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలో భాగంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

అందుకే వేకువజామున అరెస్ట్

అందుకే వేకువజామున అరెస్ట్


తమకు అన్ని పార్టీలు సమానమేనని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ప్రతి పార్టీని ఒకేలా చూస్తామని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోనే శాంతి భద్రతల సమస్య ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అంతటా ప్రశాంతంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల చర్యల్లో భాగంగానే వేకువజామున అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. తాము అందరి విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎవరికైనా ప్రచారం చేసుకునే వీలు కల్పిస్తామని, ఆ స్వేచ్ఛ ఉందని చెప్పారు.

కేసీఆర్ సభ ముగిశాక విడిచిపెడతారు

కేసీఆర్ సభ ముగిశాక విడిచిపెడతారు

రేవంత్ రెడ్డి అరెస్టుపై ఎస్పీ అన్నపూర్ణ కూడా స్పందించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను అరెస్టు చేశామని చెప్పారు. ఈసీ ఆధేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేవంత్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, కేసీఆర్ సభను అడ్డుకుంటామని ఆయన పిలుపునిచ్చాడని గుర్తు చేశారు. కేసీఆర్ సభ ముగిశాక, ఆయన వెళ్లిన వెంటనే విడిచిపెడతామని చెప్పారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్: కాంగ్రెస్ నేతల ప్రశ్నల వర్షంరేవంత్ రెడ్డి అరెస్ట్: కాంగ్రెస్ నేతల ప్రశ్నల వర్షం

ఉద్రిక్తతల మధ్య అదుపులోకి

ఉద్రిక్తతల మధ్య అదుపులోకి

కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని మంగళవారం వేకువజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రిపూట తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బలవంతంగా లాక్కెళ్ల వాహనంలో కూర్చోబెట్టారు. రేవంత్‌తో పాటు అతని సోదరుడిని కూడా అరెస్టు చేశారు. తొలుత అతనిని జడ్చర్ల ట్రెయినింగ్ సెంటర్‌కు తరలించారు. అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కొడంగల్‌లో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే రేవంత్ ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ ఇంటి వద్ద అనుచరులు, మీడియాను పోలీసులు బయటకు పంపించారు. పోలీసులను ఫాలో అవుతున్న రేవంత్ కారును పోలీసు జీపు ఢీకొట్టింది. రేవంత్ కారు తాళాలను పోలీసులు లాక్కెళ్లిపోయారు. పలువురు అనుచరులను కూడా అరెస్ట్ చేశారు.

పోలీసులతో రేవంత్ భార్య వాగ్వాదం

అరెస్టుపై రేవంత్ సతీమణి గీత స్పందిస్తూ.. తన భర్తను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు. అన్యాయానికి ఇది పరాకాష్ట అన్నారు. మేం ఏమైనా టెర్రరిస్టులమా అని ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ చెప్పాలని తన ఇంటి వద్ద ఉన్న పోలీసులతో గీత వాగ్వాదానికి దిగారు. రిటర్నింగ్ అధికారికి కూడా రేవంత్ భార్య ఫిర్యాదు చేశారు.

అలా చెప్పడం లేదు

అలా చెప్పడం లేదు

రేవంత్ రెడ్డిని అరెస్ట్‌ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని ఆయన సతీమణి గీత డిమాండ్‌ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశామని పోలీసులు చెప్పడం లేదన్నారు. ఎనిమిది గంటలుగా ఓపికగా ఉన్నామని, కుటుంబసభ్యులతో పాటు రేవంత్‌ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే తాము కోరుకుంటున్నామన్నారు. రేవంత్‌ను తీసుకెళ్లింది పోలీసులో కాదో తామెలా నిర్ధారించుకోవాలన్నారు. స్థానిక పోలీసులైతే హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తారని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు, అరెస్టు వారెంట్ కూడా చూపించకుండా రేవంత్‌ను తీసుకు వెళ్లారని చెప్పారు. తీసుకెళ్లింది పోలీసులే అయినప్పుడు ఎక్కడున్నారో చెప్పడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉన్నారన్నారు. కుటుంబ సభ్యులుగా రేవంత్‌ వివరాలు తమకు తెలియాలన్నారు.

రేవంత్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పద వ్యక్తి

రేవంత్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పద వ్యక్తి

ఇదిలా ఉండగా, రేవంత్ రెడ్డి వద్ద ఆయన అరెస్టు సమయంలో అనుమానాస్పద వ్యక్తి తచ్చాడాడు. ఓ వ్యక్తి అక్కడ కనిపించగా.. రేవంత్ ఇంటి వద్ద సెక్యూరిటీ, రేవంత్ సతీమణి గీత అతనిని నిలదీశారు. తాను పోలీసులును అని చెప్పి ఆ అనుమానాస్పద వ్యక్తి వచ్చాడు. దీంతో నీ ఐడీ కార్డు చూపించాలని వారు అడిగారు. అతను మాత్రం ఐడీ కార్డు లేకుండా ఎలా వస్తానని చెప్పాడు కానీ, బయటకు మాత్రం తీయలేదు. పరిస్థితి చూస్తే ఆయన పోలీసు కానట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తి తచ్చాడటం కలకలం రేపుతోంది.

English summary
CEO Rajat Kumar responded on Telangana Congress working president Revanth Reddy's arrest. Revanth Reddy's wife Geetha questions police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X