హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గేటెట్ కమ్యూనిటీ గేట్ క్లోజ్: చాడ వెంకట్‌రెడ్డిని రానీయని కాలనీవాసులు, ప్రభుత్వంపై ఫైర్

|
Google Oneindia TeluguNews

శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన కొనసాగుతోంది. తమ కూతురు ప్రియాంకరెడ్డిని హతమార్చిన వారికి వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం వరకు వారికి నేతలు సంఘీభావం తెలిపిన సందర్భంలోనూ ఇదే విషయాన్ని తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులను పరామర్శించేందుకు సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి రాగా.. కాలనీ వాసుల నుంచి నిరసన ఎదురైంది.

చాడకు పరాభావం

చాడకు పరాభావం

కుటుంబసభ్యులను పరామర్శించేందుకు తన అనుచరులతో కలిసి చాడ వెంకట్‌రెడ్డి వచ్చారు. అయితే గేటెడ్ కమ్యూనిటీ వాసులు వారిని అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి లోపలికి రానీయబోని తేల్చిచెప్పారు. వారి వైఖరిని నిరిస్తూ సీపీఐ నేతలు గేటు మందు ఆందోళనకు కూడా దిగారు. తమను లోపలికి అనుమతించకపోవడంతో చేసేదేమీ లేక.. చాడ వెంకట్‌రెడ్డి అండ్ కో వెనుదిరిగింది.

ఐబీ ఏం చేస్తోంది..

ఐబీ ఏం చేస్తోంది..

రాష్ట్రంలో మహిళల రక్షణపై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోలేదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఎందుకు తిరగడం లేదని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో ఉన్న నలుగురు నిందితులు మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులను వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు తగిన రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

బుధవారం రాత్రి మానవృగాలకు బందీగా వైద్యురాలు చిక్కగా.. వారు చుక్కలు చూపించారు. తమ వద్ద ఉన్న మద్యం కూడా తాగించారనే కఠోర నిజం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యం చేశారని తెలుస్తోంది. అప్పుడు కూడా కేకలు పెట్టిన కీచకులు కరుణించలేదు. తమ వాంఛను తీర్చుకొని మట్టుబెట్టారు.

నిరసనల పర్వం

నిరసనల పర్వం

శనివారం షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితులు పీఎస్‌లో ఉన్నారని తెలుసుకొని భారీగా స్థానికులు తరలొచ్చారు. వారు ఎక్కడ స్టేషన్‌లోపలికి వస్తారని భయపడి.. గేటుకు తాళం వేశారు. చివరికి టాస్క్‌ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగడంతో వారిని జైలుకు తరలించారు. అంతకుముందు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడతో జైలుకు తరలించారు.

English summary
chada venkat reddy not allow to sridhar reddy’s gated community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X