హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాత చాలనాలకు కొత్త రేట్లు చెల్లించాలి.. వాహనదారులను టెన్షన్ పెడుతున్న పోస్ట్, పోలీసుల వివరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫ్రీ అని చెబితెనో .. రాయితీ అని ప్రకటిస్తే చాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఆఫర్లు ఉంటేనే షాపింగ్ చేసే వారు కొందరుంటారు. ఇక ట్రాఫిక్ చాలానాలపై కూడా రాయితీ అని అప్పట్లో ప్రకటించి .. ఇచ్చారు కూడా. కానీ తర్వాత ఫేక్ ప్రచారం జరిగింది. దీంతో వాహనదారులు అక్కడికి చేరడంతో పోలీసు పెద్దలే ఖంగుతిన్నారు. తామేం అలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ పోస్టయ్యింది. అదే ట్రాఫిక్ చాలానాల గురించి .. దీని గురించి ఓ పోస్ట్ వైరలవడంతో పోలీసులు స్పందించారు.

మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చాలనాలు ఈ నెల 31వ తేదీలోగా చెల్లించండి లేదంటే సెప్టెంబర్ ఒకటి నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ అయిన వెంట పాత జరిమానాలు కూడా ఆటోమెటిక్‌గా కొత్త ధరలతో రెట్టింపు అవుతాయి. అని కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్ వింగ్ పేరుతో పోస్టయ్యింది. దీని గురించి నెటిజన్లు జోరుగా చర్చిస్తున్నారు. అయితే ఈ పోస్ట్ పోలీసు బాసులకు కూడా చేరింది. ఇది రూమర్ అని .. పోలీసు పెద్దలు క్లారిటీ ఇచ్చారు. తమ విభాగం అలాంటి ప్రకటన చేయలేదని వారు స్పస్టంచేశారు.

challan updation news are fake : police official

సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టు గురించి జనం ఆందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందిచాలని కొందరు సోషల్ మీడియా వేదిక కోరారు. దీంతో పోలీసు అధికారులు స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అసత్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ చాలనాలకు సంబంధించి అప్ డేషన్ ఏమి లేదని వివరించారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారెవరో కనుక్కొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అసత్యాలు ప్రచారం చేసి జనాన్ని ఇబ్బందికి గురిచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

English summary
Pay pending charges on your vehicles by the 31st of this month, or with a software update starting September 1, the old penalties will automatically double. The Commissioner of Police has been named as the Traffic Wing. people have been discussing this vigorously. But the post also reached out to police bosses. This is Rumor .. The police gave Clarity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X