హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.70 లక్షలు: మీడియా ప్రతినిధులకే టోకరా, ఒక్కొక్కరి నుంచి వసూల్, కేటుగాడి అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో ఇళ్లు అంటే సామాన్యుడికి కలే. ఇక డబుల్ బెడ్ రూం అంటే జీవిత లక్ష్యం నెరవేరినట్టే. అయితే మధ్య తరగతి ప్రజల ఆశలను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అలా మీడియా ప్రతినిధులను చీట్ చేశాడు ఓ ప్రబుద్దుడు. అయితే నేషనల్ హైవేపై ఫేక్ ఐడీ కార్డు చూపించడంతో.. కటకటల పాలయ్యాడు. తర్వాత ఆరా తీస్తే.. మనోడి మోసాలు ఒక్కొక్కటీ వెలుగుచూశాయి. పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులను చీట్ చేసి రూ.70 లక్షల వరకు దండుకున్నాడని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ఈజీ మనీ కోసం..

ఈజీ మనీ కోసం..


పశ్చిమ గోదావరి జిల్లా నడిమిలంకకు చెందిన గుతుల ప్రశాంత్‌‌ కెపీహెచ్‌‌బీలో ఉంటున్నాడు. అయితే అతను ఈజీ మనీ సంపాదించడంపై ఫోకస్ చేశాడు. ఇందుకోసం ఒక కేబుల్ టీవీ ఏర్పాటు చేసి.. ప్రెస్ ఐడీ కార్డు ముద్రించాడు. తర్వాత నిజాంపేట్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, మియాపూర్‌లో పనిచేసే మీడియా సంస్థల్లో పనిచేసేవారితో పరిచయం చేసుకున్నాడు. సమయం చూసి డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

మాటలు నమ్మి..

మాటలు నమ్మి..

అతను చెప్పే మాయమాటలు వారు కూడా నమ్మారు. ఒక్కొక్కరు రూ.1.55 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు వసూల్ చేశాడు. 10 రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్‌మెంట్ పేరుతో మేడ్చల్ సెక్షన్ ఆఫీసర్ సైన్ ఫోర్జరీ నకిలీ అలాట్ మెంట్ లెటర్ ఇచ్చాడు. అలా 40 మంది నుంచి రూ.70 లక్షలు ముక్కుపిండి వసూల్ చేశాడు.

Recommended Video

Posani Krishna Murali Believes Minister KTR & Harish Rao Are Honest
టోల్ చెల్లించకపోవడంతో దొరికి..

టోల్ చెల్లించకపోవడంతో దొరికి..

మరోవైపు నేషనల్ హైవేపై టోల్ ఫీజు చెల్లించకుండా ప్రశాంత్ ట్రావెల్ చేసేవాడు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ ఎస్సైగా ఫేక్ ఐడీ చూపించి దొరికిపోయాడు. జూన్ 24వ తేదీన విజయవాడ భవానీ నగర్ వెహికిల్ చెకింగ్ చేయగా పోలీసులకు దొరకడంతో అరెస్టయ్యారు. తర్వాత అతని మోసాలపై మాదాపూర్ స్పెషల్ ఆఫరేషన్ టీమ్ విచారించింది. దీంతో అతని మోసాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి 8 లక్షల క్యాష్‌ ఫేక్ అలాట్ మెంట్ లెటర్స్‌‌, స్టాంప్స్, ఫేక్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
cheated rs 70 lakh in the name of double bedroom houses in madhapur. cheater prashanth arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X