హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగాల పేరుతో యువతులకు కోట్లకు టోకరా .. కేసులు పెట్టినా మారని కేటుగాడు

|
Google Oneindia TeluguNews

ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే వాళ్ళు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా యువతులకు ఉద్యోగాలిస్తామని చెప్పి, యువతులను మోసం చేసి కోట్లకు టోకరా వేసిన కేటుగాడిని పట్టుకోటానికి పోలీసులు యత్నిస్తున్నారు .

సోషల్‌ మీడియాలో యువతుల ట్రాప్ ... కోట్ల రూపాయల మోసం

సోషల్‌ మీడియాలో యువతుల ట్రాప్ ... కోట్ల రూపాయల మోసం


సోషల్‌ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని వారికి మాయమాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టాడు ఒక ఘరానా సైబర్ నేరగాడు . అప్పట్లో సుస్మిత, స్నేహా రెడ్డి అనే పేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మోసం చేసిన సదరు సైబర్‌ నేరగాడు ప్రస్తుతం హర్ష అనే పేరుతో మోసం చేశారని గుర్తించిన పోలీసులు సదరు కేటుగాడి కోసం గాలింపు చేపట్టారు . ఇక ఈ కేసుని సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . తనకు రూ.20 కోట్ల వర్క్ ప్రాజెక్టు వచ్చిందని తన బంధువుల వద్ద నుంచి హర్ష అనే పేరుతో ఒక వ్యక్తి రూ. 58 లక్షలు మోసం చేశాడంటూ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో నివాసముండే వైద్య విద్యార్థిని రెండు రోజుల క్రితం సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..పాత నేరాల చిట్టా చూసి షాక్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..పాత నేరాల చిట్టా చూసి షాక్


ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సదరు నిందితుడి గురించి తెలుసుకుని షాక్ అయ్యారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, రామచంద్రారావు పేటకు చెందిన జోగడ వంశీకృష్ణ అలియాస్‌ హర్షవర్థన్‌రెడ్డి అని తేలటంతో అతని పాత నేరాల చిట్టా కూడా బయటకు వచ్చింది . ఇతడు బీటెక్‌ మధ్యలోనే ఆపేసి 2014 లో హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చాడని , హైదరాబాద్ లో బతుకు తెరువు కోసం కొన్నాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సోషల్‌ మీడియాలో జిమ్మిక్కులు చేయడంలో పట్టుసాధించాడని చెప్తున్నారు పోలీసులు .

ఫేక్ ఐడీలతో మోసం ..గతంలోనూ కేసులు

ఫేక్ ఐడీలతో మోసం ..గతంలోనూ కేసులు

ఆ క్రమంలో తియ్యని మాటలతో పలువురు యువతులకు వల వేసి , వారికి మాయమాటలు చెబుతూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ నగరాల్లో తిరుగుతూ గుర్రపు పందాలు ఆడాడని చెప్పారు . 2017లో సుస్మిత అనే పేరుతో ప్రొఫైల్‌ తయారు చేసి, ఆమె స్నేహతురాళ్లకు మెసేజ్‌లు పెట్టి, ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఆమె స్నేహితులను ఫేస్‌బుక్‌లో పలుకరిస్తూ మంచి చెడ్డల గురించి ఆరా తీయడం, ఉద్యోగం కావాలంటే తన స్నేహితుడు వంశీకృష్ణ ఉన్నాడంటూ డబ్బులు లాగేవాడు. అలాగే స్నేహరెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ ఐడీ తయారు చేసి, దాని ద్వారా మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలంటూ నమ్మిస్తూ రూ. 1.37 కోట్లు కొట్టేశాడు.

 తాజాగా మరో చీటింగ్ కేసు .. పోలీసుల గాలింపు

తాజాగా మరో చీటింగ్ కేసు .. పోలీసుల గాలింపు


ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతను అదే దారిలో మోసాలు చేస్తూనే ఉన్నాడు . ఇతడి మోసాలపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో 2017, జూన్‌ 15న సైబరాబాద్‌ పోలీసులు ఈ సైబర్‌ నేరగాడిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాక కూడా మోసాలకు పాల్పడ్డాడు . ఇక ఇంత మందిని మోసం చేస్తూ కేసులు అయినా సరే మానకుండా చీటింగ్ చేస్తున్న వంశీకృష్ణను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం గాలింపు చేపట్టింది.

English summary
A cyber criminal who introduced young women on social media and trapped them into sacking them. He said to them about employment and he has taken money from them . He created fake ids in Facebook account, have now been identified as Harsha. he cheated 58 lakh rupees from a young woman . The case is being investigated by CCS police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X