• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా సోకిన పనివాళ్ల పట్ల చిరు వినూత్నస్పందన.!మెగాస్టార్ నిర్ణయానికి నెవ్వరపోయిన పరిశ్రమ.!

|

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మెగా మనసున్న మారాజు అని మరోసారి రుజువుచేసుకున్నారు. మానవతా హృదయంతో చిరంజీవి స్పందించిన తీరుకు అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చిరంజీవి వ్యవహరించిన తీరుకు అభినందనలు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత క్రింది స్దాయి వర్గాలను అంతగా పట్టించికోని నేటి సమాజంలో చిరంజీవి మాత్రం అందుకు విరుద్దండా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మెగాస్టార్ చేసిన ఏ పనికి ఇంతటి చర్చ జరుగుతుందో తెలుసుకుందాం.

కరోనా ప్రమాదకరం..కాని జాగ్రత్తలు తీసుకుంటే తరిమికొట్టొచ్చన్న మెగాస్టార్..

కరోనా ప్రమాదకరం..కాని జాగ్రత్తలు తీసుకుంటే తరిమికొట్టొచ్చన్న మెగాస్టార్..

కరోనా క్లిష్ట సమయంలో మానవసంబంధాలు మృగ్యంగా పరిణమిస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలన్నా, వారితో మాట్లడల్లా గజగజ వణికే పరిస్ధితులు తలెత్తాయి. బయటి వ్యక్తులే కాకుండా తోబుట్టువులు, బందువులు ఎవరైనా కరోనా బారిన పడితే ఇబ్బందికరంగా భావించే పరిస్థితులు నెకొన్నాయి. అంతే కాకుండా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న సమయంలొ కరోనా బాదితులకు ఎంతో కొంత భరోసా కల్పిస్తే వారు మనోస్త్యైర్యంతో కరోనాను జయించే అవకాశాలు ఎక్కువాగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి అచ్చం ఇలాగే వ్యవహరించినట్టు తెలుస్తోంది.

విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన చెందుతున్న ప్రజానికం..

విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన చెందుతున్న ప్రజానికం..

ప్రపంచ దేశాలతో చాలగాటం ఆడుకుంటున్న కరోనా వైరస్ భారత దేశంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా బెంబేలెత్తిస్తోంది కరోనా వైరస్. ఎవరికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అవుతుందో, ఎటునుండి ఈ వైరస్ సోకుతుందో అర్దం కాని అయోమయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ధనిక-పేద, చిన్నా-పెద్ద, ఆడ-మగ తారతమ్యం లేకుండా కరోనా మానవాళి మీద విజృంభిస్తోంది. మందులేని ఈ మాయదారి మహమ్మారి దాడికి అవగాహన లేని చాలా మంది అభాగ్యులు బలైపోతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పనిచేసే నలుగురు పనివాళ్లకు కూడా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ జరిగింది.

చిరంజీవి ఇంట్లో పని వాళ్లకు కరోనా.. ఒక్కసారే నలుగురికి సోకిన మహమ్మారి..

చిరంజీవి ఇంట్లో పని వాళ్లకు కరోనా.. ఒక్కసారే నలుగురికి సోకిన మహమ్మారి..

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని పనివాళ్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిన వెంటనే చిరు వ్యవహరించిన తీరు పట్ల ప్రశంసలు అందుతున్నాయి. మొదట చిరంజీవి ఇంట్లో కూరగాయలు శుభ్రం చేసే లక్ష్మీ అనే మహిళకు కరోనా పాజిటీవ్ నిర్ధరణ అయ్యింది. ఆమె ద్వారా మార్కెట్ నుండి వివిధ రకాల సరకులు తీసుకొచ్చే స్వరూప్ కళ్యాణ్ అనే పనివాడికి కరోనా వ్యాపించింది. వీరి ద్వారా ఎప్పటికప్పుడు స్మిమ్మింగ్ పూల్ శుభ్రపరిచే రాజుకు ఆయన ద్వారా తోటమాలి శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయ్యింది. వీరందరి పట్ల చిరంజీవి ఎలా స్పందించారో తెలుసా..? కరోనా సోకిన పనివాళ్లను ఉద్యోగం నుండి తొలగించకుండా చిరంజీవి చేసిన బృహత్కర కార్యక్రమం ఏంటో తెలుసా.?

కరోనా బాదితుల పట్ల చిరంజీవి వ్యవహరించిన తీరు అద్బుతం.. మెగాస్టార్ కు అందుతున్న ప్రశంసలు..

కరోనా బాదితుల పట్ల చిరంజీవి వ్యవహరించిన తీరు అద్బుతం.. మెగాస్టార్ కు అందుతున్న ప్రశంసలు..

కరోనా సోకిన నలుగురు పనివాళ్లను మాదాపూర్ కి దూరంగా ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో, స్వీయనియంత్రణలో ఉంచి ప్రత్యేక చికిత్స అందించారు మెగాస్టార్. అంతే కాకుండా మెస్సులు, హోటళ్లు లేని తరుణంలో చిరంజీవి ఇంటినుండే ప్రత్యేక వంటలతో వారికి భోజనం, టిఫిన్లు ఇతర తినుబండారాలు అందేలా ఏర్పాట్లు చేసారు చిరంజీవి. కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఎలా వ్యవహరించాలో అన్ని చర్యలు చేపట్టి వారిలో గుండె ధైర్యాన్ని నింపారు చిరంజీవి. అలా వారందరిని హోం క్వారంటైన్ లో ఉంచిన చిరంజీవి వారు కోలుకునే వరకూ ప్రత్యేక శ్రద్ద వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒకటికి రెండు సార్టు టెస్టులు నిర్వహించగా ఆ నలుగురు పనివాళ్లకు కరోనా నెగటివ్ రావడంతో వారందరిని చిరంజీవి తిరిగి పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కరోనా రోగి అంటేనే పరుగుపెట్టే ప్రస్తుత తరుణంలో మెగాస్టార్ చాటుకున్న మెగా మనసుకు అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుతున్నాయి.

English summary
Four corona-infected workers in self-control in an apartment flat away from Madhapur Megastar provided special treatment.Apart from that, when there are no messes and hotels, Chiranjeevi arranges meals, tiffins and other delicacies for them with special dishes from home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X