హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్‌ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్‌ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో ద్వారా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే... ముఖ్యమంత్రి,ఆయన కొడుకు బయటకు రాకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలను ఇలా రోడ్డున వదిలేశారని మండిపడ్డారు. 'మీ మనవళ్లకో,కొడుకులకో ఏమైనా జరిగితే తట్టుకోగలరా... ప్రతీ ఇంట్లోనూ రక్త సంబంధాలు ఉంటాయి... ప్రజలు చనిపోతుంటే పట్టించుకోరా..' అంటూ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రజలు మేల్కోవాలని... ప్రతీ ఒక్కరూ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఇంటింటికి పరీక్షలు చేయించండి...

ఇంటింటికి పరీక్షలు చేయించండి...

ఆదివారం(జూలై 26) రాత్రి తన స్నేహితుడు ఒకరు కరోనాతో చనిపోయారని రాకేష్ మాస్టర్ తెలిపారు. మామూలు జ్వరమే అనుకుని వారం రోజుల పాటు అతను ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. చివరకు అది కరోనాగా నిర్దారణ అయి ప్రాణాలు కోల్పోయాడన్నారు. తుమ్ము వస్తే ఏముందో... దగ్గు వస్తే ఏముందో తెలియక జనం సతమతమవుతున్నారని అన్నారు. అవగాహన లేక రోడ్లపై తిరుగుతూ వైరస్ వ్యాప్తి చెందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు అని... కానీ అలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి సమయంలో బయటకు రాకపోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వాలున్నది ప్రజలను కాపాడేందుకు అని,వారిని నాశనం చేసేందుకు కాదని పేర్కొన్నారు. ఇకనైనా ఇంటింటికీ పరీక్షలు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

కడుపు కాలిపోతోంది... కాపాడేందుకు రా...

కడుపు కాలిపోతోంది... కాపాడేందుకు రా...

'పదవిలో ఉన్నామని మాట్లాడినోళ్లను జైల్లో పెట్టించడం కాదు. చస్తున్నాం ఇక్కడ. నిన్ను నమ్మి ఓటేసిన పాపానికి అంటీ ముట్టనట్లు ఉంటే ఎలా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికీ పరీక్షలు చేయిస్తున్నాడు. ఓట్ల సమయంలో ప్రజల వద్దకు వచ్చి దండాలు పెట్టి ఓట్లు అడగడం కాదు. ఇప్పుడేమో ప్రజలను రోడ్లపై వదిలేశారు. కడుపు కాలిపోతోంది. నేను మిమ్మల్ని హెచ్చరించట్లేదు. చేతులు జోడించి అడుగుతున్నా. తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు. కాపాడేందుకు రా... ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఇంకా చాలామంది చనిపోతారు.' అని రాకేష్ మాస్టర్ వాపోయారు.

ఇంట్లో కూర్చొని నీ ఖాందాన్‌ని కాపాడుకోవడం కాదు...

ఇంట్లో కూర్చొని నీ ఖాందాన్‌ని కాపాడుకోవడం కాదు...

'మొదట్లో కరోనాపై మాట్లాడారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. ప్రజలు మీ పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వచ్చేసారి మీరు ఉండరిక... ఇలా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు వారికి సేవ చేయండి. ప్రజలు ప్రజలకు చెప్పుకుంటున్నారు కషాయం తాగండని,ఇంకోటని. మీరేమీ చెప్పట్లేదు. ఇప్పటికైనా వైరస్ పట్ల అవగాహన కల్పించండి. వైరస్ ఉన్నవారిని తీసుకెళ్లి చికిత్స అందించండి. వైన్ షాపులు మూసివేయండి. బంగారు తెలంగాణ కాదు... శవాల తెలంగాణగా పేరు వస్తోంది. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ ఖాందాన్‌ని కాపాడుకోవడం కాదు. ప్రజలను కాపాడు. ప్రజలు నిన్ను నమ్మారు.' అంటూ రాకేష్ మాస్టర్ ముఖ్యమంత్రిని నిలదీశారు.

Recommended Video

CM YS Jagan - 'ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవ్వాలి' || Oneindia Telugu
ప్రజలు నిలదీయాలి...

ప్రజలు నిలదీయాలి...


'ఆస్పత్రికి వెళ్తే లక్షల బిల్లులు... ఎక్కడినుంచి తెస్తారు... కరోనా టెస్టుకు రూ.3వేలు.. ఎక్కడినుంచి వస్తాయి. ఇంటి అద్దెలు కట్టలేక చస్తున్నారు. ఓట్లప్పుడు ప్రజల ముందుకొచ్చి మాటలతో మాయ చేయడం కాదు. చేతలతో ఇప్పుడు వాళ్ల హృదయాలను దోచుకో.మేమేమైనా మీ ఇంటికొచ్చి అన్నం అడుకుంటున్నామా. మా ఇళ్లకొచ్చి నువ్వే ఓట్లు అడుక్కున్నావు. నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి. ప్రజలారా ఒక్కొక్కరు వీడియో తీసి వదలండి వాట్సాప్‌లో. ఏం చేస్తున్నారని నిలదీయండి. కళ్లు తెరవండి. నేనేమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. కానీ నేను కడుపు కాలి మాట్లాడుతున్నా. సేవ చేసేవాడు ఇంట్లో కూర్చుంటే మనం చేతకాని దద్దమ్మల్లా ఉండకూడదు. ఇంటింటికి పరీక్షలు చేయించేందుకు నీకేం బాధ. ప్రజలారా సునామీలా ఉప్పొంగి ప్రభుత్వాన్ని నిలదీయండి.'

English summary
Choreographer Rakesh master demanded CM KCR to conduct door to door medical screening amid coronavirus.He alleged that CM KCR ignored telangana people,if it continues like this more deaths will happen in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X