హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖా‘కీచకుడు’: న్యూడ్‌గా వీడియో కాల్స్.. వివాహితకు వేధింపులు, యాసిడ్ పోస్తానని బెదిరింపులు..

|
Google Oneindia TeluguNews

అల్లరిమూకల నుంచి కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. న్యూడ్‌గా వీడియో కాల్స్ చేస్తు వేధించాడు. తన కోరిక తీర్చాలని తన వికృత రూపాన్ని చూపించాడు. యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. పిల్లలను కూడా హతమారుస్తానని చెప్పడంతో బాధితురాలు.. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

వైరల్‌ అయిన సిఐ అధికారి ప్రవర్తన ! Viral On Social Media !
ఎస్బీ ఇన్ స్పెక్టర్ వేధింపులు

ఎస్బీ ఇన్ స్పెక్టర్ వేధింపులు

నిఘా విభాగం స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) ఈస్ట్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌గా కే చంద్రకుమార్‌ పనిచేసేవాడు. బాధితురాలు వరంగల్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వనస్థలిపురంలో ఉండగా.. కొద్దిరోజుల క్రింత మిర్యాలగూడ పోలీసు స్టేషన్ వెళ్లారు. ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో పరిచయం ఏర్పడింది. సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇవ్వడంతో వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. తరచూ ఫోన్లు చేసేవాడు.

రూ.5 లక్షలు తీసుకొని మరీ..

రూ.5 లక్షలు తీసుకొని మరీ..

దీంతో వివాహిత అతనిని నమ్మింది. ఐదేళ్ల క్రితం ఆమె ఫైల్‌ సచివాలయంలో క్లియర్‌ చేయిస్తానని చంద్రకుమార్ చెప్పాడు. రూ.5 లక్షలు కూడా తీసుకున్నాడు. తర్వాత యాచారం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చాడు. పని సంగతి దేవుడు ఏరుగు.. బాధితురాలికి టార్చర్ మొదలైంది. ఫోన్లు చేయడంతోపాటు మెసేజ్ పంపుతూ వేధించడం ప్రారంభించాడు. కోరిక తీర్చాలని బెదిరించడంతో.. వివాహిత అతనిని దూరం పెట్టింది. అప్పటికీ కూడా తీరు మారలేదు. ఇంటికొచ్చి యాసిడ్‌ పోసి హత్య చేస్తానని బెదిరించాడు. పిల్లల్ని కూడా చంపుతానని.. వార్నింగ్ ఇఛ్చాడు.

రాచకొండ పోలీసులకు ఫిర్యాదు..

రాచకొండ పోలీసులకు ఫిర్యాదు..

దీనిపై వివాహిత రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రకుమార్‌కి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె వద్ద నుంచి తీసుకున్న నగదు ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆయన తీరు మాత్రం మారలేదు. తర్వాత బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్‌ చేసేవాడు. చంద్రకుమార్‌ ఆగడాలు శ్రుతి మించుతుండటంతో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌.వనస్థలిపురం పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేశారు.

సస్పెండ్.. అరెస్ట్ చేయలేదు

సస్పెండ్.. అరెస్ట్ చేయలేదు

సీపీ అతడిని సస్పెండ్‌ చేశారు. వన స్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధింపులకు గురి చేసినా చంద్రకుమార్‌ను అరెస్ట్‌ చేయలేదని బాధితురాలు వాపోయారు. వనస్థలిపురం పోలీసులు రక్షిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా.. ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.

English summary
ci chandrakumar harassed women in hyderabad. ci suspended his duties..but vanasthalipuram police save him she alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X