హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యాయ్యో వద్దమ్మా.. ఇప్పుడు సిటీ పోలీసుల వంతు.. డ్యాన్సర్ శరత్‌తో ఫేమ్.. వైరల్

|
Google Oneindia TeluguNews

అయ్యాయ్యో వద్దమ్మా.. ఇప్పుడు ఈ పదం ఫేమస్ అయ్యింది. ఆర్నెల్ల క్రితం ఓ టీ కంపెనీ యాడ్ రాగా.. తర్వాత హైదరాబాద్‌కు చెందిన శరత్ అనే డ్యాన్సర్ బరాత్‌లో చేసిన డ్యాన్స్ వైరలైంది. దీంతో ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల వంతు వచ్చింది. వారు జనాలకు అవగాహన కల్పించేందుకు అయ్యాయ్యో వద్దమ్మా అంటున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో చెప్పి.. అయ్యాయ్యో వద్దమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతోనైనా జనానికి అవగాహన వస్తుందని భావిస్తున్నారు.

అయ్యాయ్యో వద్దమ్మా..

అయ్యాయ్యో వద్దమ్మా..

బ‌హుమ‌తి గెలుచుకున్నారు.. అభినంద‌న‌లు.. అవార్డును పొంద‌డానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. అంటూ వ‌చ్చే మెసేజ్‌ల‌ను న‌మ్మ‌కండి అంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడూ సజెస్ట్ చేస్తారు. కానీ వాటికి అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. అనేసేయండి.. అంటూ హైద‌రాబాద్ సిటీ, సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. వారు ఫ‌న్నీగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అయ్యాయ్యో వద్దమ్మ అనే పదం జనాలకు మంచిగానే వెళుతుంది.

డ్యాన్సర్ శరత్ వల్లే..

డ్యాన్సర్ శరత్ వల్లే..

అయ్యాయ్యో వద్దమ్మా అనే యాడ్ ఇదివరకే వచ్చినా.. ఇటీవల మాత్రం ఫేమ్ అయ్యింది. దానికి కారణం మాత్రం డ్యాన్సర్ శరత్. హైద‌రాబాద్‌కు చెందిన శ‌ర‌త్‌.. ఓ రోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ స‌ర‌దాగా.. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. అ ప‌క్క‌నే నా టీకొట్టు ఉంది. అంద‌రికీ ఓ క‌ప్పు టీ ఇద్దామ‌నుకున్నాను.. సుఖీభ‌వ‌.. సుఖీభ‌వ.. అంటూ పాట‌పాడి తీన్‌మార్ స్టెప్పులు వేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. వైర‌ల్ అవ‌డ‌మే కాదు.. శ‌ర‌త్‌.. రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ కూడా అయిపోయాడు. ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు.

మీమ్స్..


శ‌ర‌త్ అన్న మాట‌లతో మీమ్స్ విప‌రీతంగా క్రియేట్ అవుతున్నాయి. కొంద‌రిని అవే వ్యాఖ్య‌లు ఉప‌యోగించి నెటిజ‌న్లు ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ విష‌యం చివ‌ర‌కు హైద‌రాబాద్ సిటీ పోలీసు, సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కూడా తెలిసిపోయింది. దీంతో సైబ‌ర్ నేరాల‌పై న‌గ‌ర వాసుల‌ను ఎడ్యుకేట్ చేయ‌డం కోసం ట్రెండింగ్‌లో ఉన్న అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. సుఖీభ‌వ.. అనే ప‌దాల‌ను వారు కూడా వాడుకున్నారు. శరత్ హైప్ తెగ.. పోలీసులు కూడా వాడేశారు.

టీ పౌడర్ కంపెనీ

టీ పౌడర్ కంపెనీ


ఓ టీ పౌడ‌ర్ కంపెనీ.. కొన్ని రోజుల కింద ఓ యాడ్‌ చేసింది. ఆ యాడ్‌లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌.. ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగి ఉన్న ఓ కారు ద‌గ్గ‌రికి వెళ్లి డోర్ కొడుతుంది. ఆ ట్రాన్స్‌జెండ‌ర్‌ను చూసి కారులో కూర్చున్న‌పెద్దావిడ‌.. విసిగించ‌డానికి వ‌స్తారు ఎక్క‌డి నుంచో అని కారు గ్లాస్ తీసి 10 రూపాయ‌లు ఇవ్వ‌బోతుంది. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. ఈ ప‌క్క‌నే నా టీకొట్టు ఉంద‌మ్మా.. అంద‌రికీ ఓ క‌ప్పు టీ ఇద్దామ‌నుకున్నాను. అని చెప్పి టీ తెచ్చి ఇస్తుంది. ఆ టీ పెద్దావిడ‌కు న‌చ్చ‌డంతో ఇలా రా ఒక‌సారి అని పిలిచి డ‌బ్బులు ఇవ్వ‌బోతుంది. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా ఈరోజు డ‌బ్బులు తీసుకోను అంటుంది. డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు కానీ.. సుఖీభ‌వ‌.. అంటుంది పెద్దావిడ‌. మ‌మ‌కార‌పు మాధుర్యం.. అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఆ తర్వాత శరత్ చేసిన డ్యాన్స్.. వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిటీ పోలీసులు వంతు వచ్చింది. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని వారు సజెస్ట్ చేస్తున్నారు. ఒకవిధంగా ఇదీ మంచిదే.

English summary
ayyayyo vaddamma:hyderabad city police awareness on cybercrimes use word on ayyayyo vaddamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X