హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓట్లకు నగరవాసులు దూరం.. మెదక్ లో అత్యధికం.. హైదరాబాద్ లో అత్యల్పం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.08 శాతం పోలింగ్ నమోదైంది. మొద‌టి 2 గంట‌ల్లో కాస్తా నెమ్మ‌దిగానే పోలింగ్ రికార్డయింది. మొత్తమ్మీద రాష్ట్ర‌మంతటా పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ శాతం చూసినట్లయితే మెదక్ లో అత్యధికంగా 54 శాతం నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 20.59 శాతం నమోదు కావడం గమనార్హం.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ఓటర్లు సరిగా స్పందించలేదు. అప్పుడు కూడా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా పోలింగ్ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది.

city voters not responded well medak highest hyderabad lowest polling

మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..
మెదక్‌లో 54, జహీరాబాద్‌లో 52.45, మహబూబాబాద్‌ 47.29, పెద్దపల్లిలో 47.50, నాగర్‌కర్నూల్‌లో 45.82, కరీంనగర్‌లో 45.62, ఆదిలాబాద్‌లో 45.06, మహబూబ్‌నగర్‌లో 44, నల్గొండ 42.09, ఖమ్మం 41.65, భువనగిరి 40.99, వరంగల్‌ 40.24, నిజామాబాద్‌లో 38.10, చేవెళ్ల 29.03, మల్కాజిగిరిలో 27.07, సికింద్రాబాద్‌లో 23.85, హైదరాబాద్‌లో 20.59 శాతం పోలింగ్‌ నమోదైంది.

English summary
Hyderabad Voters not responsed This time also. Voting percent worse in lok sabha elections 2019. As usual this time also voting percentage recorded low at 1 pm. Highest Voting recorded in medak, lowest recorded in hyderabad at afternoon 1 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X