• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టెక్నాలజీ తెచ్చిన తంటా : సర్వర్ ఇష్యూతో అన్నదాత విలవిల

|

హైదరాబాద్ : టెక్నాలజీతో పనులు వేగంగా సులువుగా పూర్తవుతాయి. ఆన్‌లైన్‌తో పనులన్నీ చిటికలో అవుతున్నాయి. దాదాపుగా ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్ చేశారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా గంటల్లో తమ తమ పనులు పూర్తిచేసుకోగలుగుతారు. కానీ తెలంగాణ పౌరసరఫరాలో మాత్రం ఇందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. ఇక్కడ టెక్నాలజీ చేటుచేసిందట. ఇది ఎవరో మల్లన్నో .. ఎల్లన్న చెప్పలేదో సాక్షాత్తు మంత్రి సెలవిచ్చారు. ఇంతకీ ఏమా కథో చుద్దాం పదండి.

ఆన్‌లైన్ ఆటంకం ...

రైతులు పండించే పంట విక్రయాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. పంట విక్రయం జరిగి .. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే .. ఖాతాలోనే నగదు జమచేస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలిగించకూడదని చెపట్టిన ఈ విధానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆన్ లైన్ ప్రొక్యూర్ మెంట్ మేనేజ్ మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) సాప్ట్ వేర్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీనిని డెవలప్ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అప్ డేట్ చేసే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురవతున్నాయని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియ జాప్యమవుతోందని .. అందుకే రైతులకు నగదు చెల్లింపు ఆలస్యమవుతుందని వివరించారు. వెనుకటికో నానుడి ఉంది. చదవుకున్నొళ్లు కాకరకీయ అంటే .. చదువలేనివాళ్లు దానిని కీకరకాయ అనేవారు. అంటే వారికి తెలివిలేదనే అర్థం. ఇప్పుడు పౌరసరఫరాల శాఖ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వేగంగా పనులయ్యేందుకు చేపట్టిన ఆన్ లైన్ కీకరకాయ నానుడిని గుర్తుచేస్తుంది. దీంతో ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతు చివరికి నగదు కోసం కూడా కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

civil supply survivor technical issue, stay the farmers paddy amount

15 రోజుల్లోగా చెల్లిస్తాం ....

ఓపీఎంఎస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య తమ దృష్టికి వచ్చిందని చెప్పారు మంత్రి. సమస్య పరిష్కారం కోసం నిపుణులు పనిచేస్తున్నారని వివరించారు. 15 రోజుల్లో ఇష్యూ పరిష్కారం అవుతుందని స్పష్టంచేశారు. రైతుల తమ పంట నగదు కోసం చూస్తున్నారని .. సమస్య తెలుసని .. సాంకేతిక ఇష్యూతో చెల్లింపులకు లేటవుతుందని సర్దిచెప్పారు. రైతుల ఖాతాల్లో మరో 15 రోజుల్లో నగదు జమచేయాలని సంబంధింత అధికారులకు స్పష్టం చేశారు మంత్రి. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు రూ. 7 వేల అవసరమవుతాయని మంత్రి గుర్తుచేశారు. నిధులు చెల్లించేందుకు ఇబ్బంది లేదని .. టెక్నికల్ ఇష్యూ వల్లే చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని స్పష్టంచేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Farmers cultivating crops are also known online. A bank account, Aadhaar card copy .. money is deposited in the account. The farmers not to be disturbed has caused a technical error. Technical Issue on the Online Procurement Management System (OPMS)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more