హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్‌ల మధ్య రాజకీయ వైరం

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య రాజకీయా విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పార్టీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తనను ఓ ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని ఆసహనం వ్యక్తం చేశారు. దీంతోపాటు తన ఎదుగుదలను కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమికి సైతం పార్టీలోని నేతలే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 మీడియాతో చిట్‌చాట్

మీడియాతో చిట్‌చాట్

తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్...ఆయన రూటే సెపరేటు... ఆయనకు నాయకులంటూ ఎవరు ఉండరు, ఆయనకు ఆయనే బాస్... అందుకే ఎక్కడ హిందూయిజానికి ఆపద వచ్చినా రాజాసింగ్ ముందుగా స్పందిస్తారు. పార్టీతో సంబంధం లేకుండా అక్కడ ప్రత్యక్షమవుతారు. సమాయానుకూలంగా అధికార పార్టీతో పాటు ఇతర హిందు వ్వతిరేక పార్టీలపై విమర్శలు ఎక్కువపెడుతుంటారు. దీంతో ఇటివల రాజాసింగ్ పాపులర్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన దూకుడే ఆయన శత్రువుగా మారింది. పార్టీ అగ్రనేతలు ఆయనకు శత్రులుగా మారారు. ముఖ్యంగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి , రాజాసింగ్‌కు మధ్య రాజకీయ వైరం ఉన్నట్టు రాజాసింగ్ మీడియాతో పంచుకున్నారు.

కిషన్ రెడ్డిపై అరోపణలు చేసిన రాజాసింగ్

కిషన్ రెడ్డిపై అరోపణలు చేసిన రాజాసింగ్

ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని రాజాసింగ్ అన్నారు. తన నియోజకవర్గంలో స్వంత పార్టీ ఎమ్మెల్యేకు తెలియకుండానే పర్యటనలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తనను ఒక ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని అన్నారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయ ప్రోటోకాల్ పాటించి సమాచారం ఇచ్చేవారని అన్నారు. కిషన్ రెడ్డి మాత్రం తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. దీంతో ఓకింత అసహానాన్ని వ్యక్తం చేశారు.

ఎంపీ అర్వింద్ ఆర్ధికంగా బలవంతుడు

ఎంపీ అర్వింద్ ఆర్ధికంగా బలవంతుడు

మరోవైపు పార్టీ అధ్యక్ష పదవిపైగా ఆయన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉండడం వల్లే గత ఎన్నికల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని అందుకే ఎమ్మెల్యేగా ఓడిపోయారని అన్నారు. దీంతోపాటు లక్ష్మణ్ ఓటమికి కూడ కొంతమంది నేతలు పనిచేశారని అన్నారు. మరోవైపు అధ్యక్ష పదవికి పోటిపడుతున్న బండి సంజయ్‌తో పాటు, ఎమ్మెల్యే అర్వింద్, డీకే అరుణలు సైతం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అర్హులేనని వ్యాఖ్యానించారు. అయితే అందరిలో అర్వింద్ కొంత ఆర్ధికంగా బలవంతుడిగా ఉంటాడని అన్నారు.

 యూపీ సీఎం నాకు ఆదర్శం

యూపీ సీఎం నాకు ఆదర్శం

ఇక గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు పెద్ద స్థాయి నాయకులు కంకణం కట్టుకున్నారని ..తీవ్ర ఆరోపణలు చేశాడు. అయినా పార్టీ కార్యకర్తలే వారి ప్రాణాలు ఫణంగా పెట్టి తనను గెలిపించారని రాజాసింగ్ అన్నారు. ఇక పార్టీకి సర్వీసు చేసేందుకు తనకు ఎవ్వరు సహకరించినా..సహకరించకపోయినా... తన పని తాను చేసుకుపోతానని అన్నారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి అధిత్యానాథ్ తనకు మార్గదర్శి అన్నారు. తనకు ఎలాంటీ అధ్యక్షపదవులు అవసరం లేదని అన్నారు.

English summary
Political Clashes have emerged between BJP MLA Rajasing and Union Minister Kishan Reddy.Kishan Reddy has not identified me as an MLA said Rajasing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X