• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం కార్ ఓవర్ స్పీడ్.!ఛలాన్ అంటూ వింత ప్రచారం.!అసలు సీఎం కాన్వాయికి స్పీడ్ లిమిట్ ఉంటుందా..?

|

హైదరాబాద్ : చెప్పే వాడు చైనా వాడైతే వినేవాడు వియత్నాం వాడట. ఈ సామెత ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రచారానికి కాదేదీ అనర్హం అన్నట్టు ఏ మాత్రం అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడి మేసినట్టు ఓ వార్తకు తారా స్ధాయిలో ప్రాదాన్యతనిచ్చాయి ప్రసార మాధ్యమాలు. కాగా ఆ సంఘటనలో వాస్తవాలు గాని, నిజనిర్ధారణ గాని, లోతైన విశ్లేషణ గానీ జరపకుండానే అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ప్రచారం కల్పించారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణించే వాహన శ్రేణులకు వేగంలో ఏమాత్రం పరిమితులు ఉండవు. వేగం సంబంధించిన నియమాలను అతిక్రమించినందుకు సీఎం కారుకు జరిమానా అంటూ చిత్ర విచిత్ర ప్రచారం జోరుగా సాగింది.

సీఎం కారు అతి వేగం.. జరిమానా విధించిన అధికారులంటూ విచిత్ర ప్రచారం..

సీఎం కారు అతి వేగం.. జరిమానా విధించిన అధికారులంటూ విచిత్ర ప్రచారం..

ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలు, వేగం, ఎవరెవరు సీఎం వెంట ఉంటారు, ఎంత సమయంలో గమ్య స్ధానాన్ని చేరుకోవాలి, ట్రాఫిక్ ను ఎన్ని నిమిషాలు నియంత్రించాలి అనే అంశాలు ముందుగానే నిర్ధిశించబడతాయి. వాటికనుగుణంగానే సీఎం కాన్వాయ్ దూసుకెళ్తుంది. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పతాక స్థాయిలో ప్రచారం కల్పించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అతి వేగంగా వెళ్తే సీఎం కాన్వాయ్‌పై కూడా చలాన్లు వేస్తారనే ఉత్తిత్తి వార్తను సీరియస్ అంశంగా చిత్రీకరించే ప్రయత్నం జరగడం విడ్డూరంగా పరిణమించింది.

అసలు సీఎం కాన్వాయ్ కి పరిమితులేంటి.? పిచ్చి వార్తకు రెచ్చిపోయి కల్పించిన ప్రచారం..

అసలు సీఎం కాన్వాయ్ కి పరిమితులేంటి.? పిచ్చి వార్తకు రెచ్చిపోయి కల్పించిన ప్రచారం..

మరో వింత, విచిత్రమైన విషయం ఏంటంటే గత ఏడాది కాలం నుంచి అతివేగానికి సంబంధించి మొత్తం నాలుగు జరిమానాలు వేసినట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం ఆ జరిమానాలు మొత్తం చెల్లించినట్టు కూడా ప్రసార మాధ్యమాలు దృవీకరించాయి. వావ్.. వాట్ ఎ ఫంటాస్టిక్ న్యూస్.. అనుకుంటున్నారు విశ్లేషకులు. అసలు సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కి సంబంధించి నిబంధనలు ఏ మేరకు ఉంటాయో ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి కాన్వాయ్ వేగానికి సంబంధించిన జరిమానాలు స్పీడ్ గన్స్, వాటిలో అమర్చిన వేగం తాలూకా పరిమితుల ఆధారంగా జరిమానాకు సంబంధించన సమాచారం ఆయా యంత్రాల ద్వారా వస్తుంటుంది తప్పితే ట్రాఫిక్ యంత్రాంగం ఛలాస్లు వేసే ప్రసక్తే ఉండదు.

  KCR Convoy Challaned For Overspeed CMO Paid The Amount
  సీఎం కారు జరిమానాను ప్రభుత్వం చెల్లించింది.. ఆ సొమ్ము మళ్లీ ప్రభుత్వ ఖజానాకే.. వాట్ ఎ వండర్..

  సీఎం కారు జరిమానాను ప్రభుత్వం చెల్లించింది.. ఆ సొమ్ము మళ్లీ ప్రభుత్వ ఖజానాకే.. వాట్ ఎ వండర్..

  ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కాన్వాయ్ విషయానికొస్తే సీఎం వాహన శ్రేణి ఎప్పుడూ వేగం పరిమితిని పాటించవు. ఏడాదిలో ప్రతి రోజు సీఎం కాన్వాయ్ బయట తిరుగుతూనే ఉంటుంది. మరి ఏడాదిలో నాలుగు సార్లే జరిమానాలు విధించడం ఏంటి..? అంటే ఏడాదిలో నాలుగు సార్లే సీఎం వేగంగా వెళ్లినట్టు గుర్తించారా..? మిగతా సమయంలో చాలా నెమ్మదిగా వెల్లారా..? కాన్వాయ్ లో దాదాపు 20 వాహనాల వరకూ ఉంటాయి. ముఖ్యమంత్రి కారుకు మాత్రమే జరిమానా వర్తిస్తుందా? మిగతా వాహనాలకు జరిమానాలు వర్తించవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

  సీఎం జీతం నుంచి జరిమానా చెల్లిస్తే పెద్ద వార్త.. మరి అలా జరగనప్పుడు ఎందుకు పనిలేని హైరానా..?

  సీఎం జీతం నుంచి జరిమానా చెల్లిస్తే పెద్ద వార్త.. మరి అలా జరగనప్పుడు ఎందుకు పనిలేని హైరానా..?

  ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా విధిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ఖజానా నుంచి ట్రాఫిక్ డిపార్ట్ మెంటుకు జరిమానా మొత్తాన్ని చెల్లించింది. ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వసూలు చేసిన డబ్బులు మళ్లీ తిరిగి వచ్చి ప్రభుత్వ ఖజానాలో జమవుతుంటాయి. అంటే ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వానికే చెల్లించారన్న మాట. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వయంగా తన జీతంలో నుండి జరిమానా డబ్బును చెల్లించాలని చెప్పి ఉండి ఉంటే అది బ్రేకింగ్ వార్త అయ్యేది. కానీ ప్రభుత్వ డబ్బును ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తే అందులో విషయం ఏముందనే వాస్తవాన్ని ప్రసార మాద్యమాలు మర్చిపోయి ఊకదంపుడు వార్తను ప్రచారం చేసాయి. ఇది వందకు వందశాతం కేవలం ప్రచారం కోసం మాత్రమే చేసిన జబర్ధస్థ్ స్కిట్ అని చర్చ జరుగుతోంది.

  English summary
  There are no restrictions on speed for the vehicle lines the Chief Minister is traveling. The campaign went so fast that the CM car was fined for violating speed rules.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X